భర్త ఎప్పుడు తన పక్కనే ఉండాలి అని ప్రతి భార్య కోరుకుంటుంది. భర్త పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది. అన్ని విషయాలలో తను మీ పక్కన, మీకు తోడుగా ఉంటే బావుంటుందనిపిస్తుంది. కొన్ని సార్లు అడుగుతాం. కానీ కొన్ని సార్లు అడగలనిపించదు, కానీ తను మీతోనే ఉండాలి అనే కోరిక మాత్రం ఉంటుంది. అందుకే మీ ఆయన ఎప్పుడు మీతోనే ఉండాలి అనే మీ కోరిక మీ ఆయనకు తెలియాలంటే… ఈ పనులు చేయండి.
1. కలిసి నడవండి
మీ ఆయనతో అప్పుడప్పుడు అలా బయటకు వెళ్ళినప్పుడు. కాసేపు అలా చేతులు పట్టుకుని నడవండి. మీ ఆయనకు దగ్గరగా హత్తుకుని నడవండి. ఇలా చేయడం మీ ఆయనను మీరు ఎంత కోరుకుంటున్నారో. తనకు తెలుస్తుంది.
2. హాగ్ అడగండి
మీ ఆయనను గట్టిగా హాగ్ చేసుకుని ఎన్ని రోజులైంది. భార్య భర్తల మధ్య హగ్స్ చాలా అవసరం. అవి ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమను అధికం చేస్తాయి. అందుకే మీ సంతోషాన్నయినా, దుఃఖనైనా, హగ్స్ ద్వారా పంచుకోండి.
3. తాకుతూ ఉండండి
మీ మధ్య మాటలు లేకుండానే సంభాషణ జరగడానికి, స్పర్శ అవసరం. అందుకే మీ ఆయనను ప్రేమగా నిమరడం లాంటివి చేయండి. మీ ఆయనను మీరు ఎంత ప్రేమిస్తున్నారో మీ స్పర్శ ద్వారా తెలియ చేయండి.
4. గాఢంగా ముద్దు పెట్టండి
ముద్దు పెట్టడం అంటే చేతి మీదనో, బుగ్గ మీదనో కాదు. ఆధారాలతో చుంబిస్తేనే మీ కోరిక గాఢత్వం మీ ఆయనకు తెలుస్తుంది. మీ గాఢమైన ముద్దు ద్వారా మీ కోరికను తెలియచేయండి.
5. పంచుకోండి
ప్రతి రోజు, మీరు ఎం చేసారో, ఆఫీస్ లో కానీ, ఇంట్లో కానీ ఏమి జరిగిందో అన్ని విషయాలను మీ ఆయనతో పంచుకోండి. అన్ని వివరంగా చెప్పండి. మీరు చేయాలనుకునే పనుల గురించి మీ ఆయన సలహా కూడా తీసుకోండి. తనకు మీరు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో తెలియ చేయండి.
మీ ఆయన మీతోనే ఉండాలి అని మీరు కోరుకుంటే… ఇది మీ ఆయనకు తప్పకుండా SHARE చేయండి