యోని-ఉత్సర్గ-vaginal-discharge-రంగు-మీ-ఆరోగ్యం-గురించి-ఏమి-చెప్తుంది-xyz

యోని గురించి ప్రతి విషయం మహిళల్లో ఒక తెలీని ఉత్సుకతను తెస్తుంది. అది మంచిది కూడా. మీ శరీరం గురించి తెలుసుకోవాలనుకోవడం చాలా మంచి విషయం. ఆలా తెలుసుకుంటే ఎన్నో సమస్యలు మనం ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. ఆలా తెలుసుకోవాల్సిన దానిలో ముఖ్యమైన విషయం యోని ఉత్సర్గ (Vaginal Discharge). దీని రంగుని బట్టి మీ ఆరోగ్య పరిస్థితి చెప్పవచ్చు అంటే నమ్మగలరా? నిజమండి, అది ఎలాగో చూద్దాం పదండి.

మీ శరీరమే మీకు దేవాలయం, అలాంటి దానిలో దేని గురించి తెలుసుకోవడానికి మొహమాటపడకండి. మీకు సందేహం ఉన్న ఎటువంటి దాని గురించైనా అడిగి తెలుసుకోవడానికి సంకోచించకండి.

యోని ఉత్సర్గ (Vaginal Discharge) అంటే ఏమిటి?

గర్భాశయ శ్లేషం మరియు యోని ఉత్పత్తుల మిశ్రమం కలిసి బయట వచ్చే దానిని యోని ఉత్సర్గ అంటారు. ఇది రావడం కూడా శరీరంలో జరిగే అన్ని ప్రక్రియల మారిగా సర్వ సాధారణ ప్రక్రియ. కాబట్టి దానిని చూసి భయపడకండి, కంగారుపడకండి.

యోని ఉత్సర్గ సాధారణం అయినప్పటికీ అది వివిధ రంగుల్లో వస్తే మీకు ఇన్ఫెక్షన్ వచ్చినట్టు అర్థం. ఇలా జరగడం మంచి విషయం కాదు. పసుపు రంగులో కానీ పచ్చ రంగులో కానీ ఇది వస్తూ చేదు వాసన వస్తే మీకు బాక్టీరియా ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఉందని అర్థం.

4 రకాల యోని ఉత్సర్గలు ఉంటాయి, అవి ఏమిటి?

1. తెల్లని ఉత్సర్గ (White Discharge)

ఇది చాలా సాధారణమైనది, ఆడవారికి రుతుక్రమం జరిగే ముందు తరువాత ఇది వస్తుంది. కానీ, ఒకవేళ ఇది మీకు చిక్కగా వస్తూ యోని దగ్గర నవ్వగా ఉంటె మాత్రం మీకు ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది.

2. బ్రౌన్ లేదా స్వల్ప రక్తపు ఉత్సర్గ (Brown or Slightly Bloody Discharge)

పీరియడ్స్ సమయంలో ఇది మాములే కానీ, మిగతా సమయంలో ఇలా రావడం సహజం కాదు. మామలు సమయాల్లో ఇలా వస్తుందంటే మీరు ప్రేగ్నన్ట్ అవ్వబోతున్నారు అని అర్థం. ఒకవేళ ప్రగ్నన్సీ మొదటి సమయాల్లో ఇలా వస్తుందంటే గర్భం స్రావం జరిగే అవకాశం ఉందని అర్థం.

3. పసుపు రంగు ఉత్సర్గ (Yellow Discharge)

మీకు ఉత్సర్గ పసుపు రంగులో చిక్కగా చెడు వాసనతో వస్తే యోని ఇన్ఫెక్షన్ అని అర్థం. ఇతర పురుషులతో సెక్స్లో పాల్గొనడం వలన ఇది సంభవిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ పేరు ‘Trichomoniasis’.

4. పచ్చ రంగు ఉత్సర్గ (Green Discharge)

ఈ రంగులో వస్తే కచిత్తంగా మీ యోనిలో ఎదో సమస్య ఉందని అర్థం. కొంత మంది విటమిన్ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు కూడా ఇలా వచ్చిందని చెప్పారు. పచ్చని రంగులో ఉత్సర్గ వస్తే మాత్రం వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించండి.

డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి

ఈ క్రింది లక్షణాలు కనపడితే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించండి

1. మూట విసర్జన సమయంలో మాన్తా కలగడం

2. మీ యోని చేదు వాసన రావడం

3. ఉత్సర్గ రంగు మారి వచ్చినప్పుడు

4. యోని ప్రదేశంలో నవ్వ కలుగుతుంటే

దీనిని Share చేసి ఇతర మహిళలకు కూడా సహాయం చేయండి, ఈ విషయాలు తప్పక తెలుసుకోమని చెప్పండి.

Leave a Reply

%d bloggers like this: