పిల్లలు బరువు, తల్లి తండ్రులకు ఎప్పుడు ఒక సమస్యే. పిల్లలు బరువు పెరగడానికి, పోషకాహారాలను తినడానికి ఇష్టపడరు. అందుకే పోషకాహారాలను, వారు ఇష్టపడే విదంగా తయారుచేయాలి. పిల్లలు బరువు పెరగడానికి, వారు ఇష్టంగా తినేలా ఈ ప్రోటీన్ లడ్డు తినిపించండి. ఆ లడ్డు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి…
Video Credits : Foodvedam
కావాల్సిన పదార్ధాలు
మినపప్పు – 170 గ్రా
ఓట్స్ – 30 గ్రా
రాగి పిండి – 80 గ్రా
జీడీ పప్పు – 35 గ్రా
బాదాం – 35 గ్రా
బెల్లం – 200 గ్రా
నెయ్యి – 100 గ్రా
యాలకులు – 5
తయారు చేసే విధానం
1. మినపప్పును కడిగి, 15 – 20 నిమిషాల పాటు ఆరపెట్టండి. మినపప్పును కడిగేటప్పుడు ఎక్కువ సేపు నీళ్ళలో ఉంచకండి. నాని పోతాయి
2. తరువాత జీడీ పప్పు, బాదాం, మినపప్పు, ఓట్స్ వేరుగా వేయించి పక్కన పెట్టుకోండి
3. వేయించిన పదార్ధాలన్నిటిని, బ్లెండర్ లో పౌడర్ చేసుకోండి.
4. తరువాత ప్యాన్ లో నెయ్యి వేడి చేసి, అందులో రాగి పిండి కలపండి.
5. తరువాత అన్ని పౌడర్స్ అందులో వేసి, నెయ్యి, బెల్లంతో కలిపి ముద్దలు చేసుకోండి. (ఈ వీడియోలో బెల్లానికి బదులు ఆర్గానిక్ చక్కర వాడారు, కానీ మీరు బెల్లం కూడా వాడచ్చు)
వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు. రోజు రెండు లడ్డులు తింటే త్వరగా బరువు పెరుగుతారు.
అందరికి తప్పకుండా SHARE చేయండి
ఇవి కూడా చదవండి
చిన్న పిల్లలు ఇష్టంగా తినే, బలవర్ధకమైన చికెన్ వంటకం: ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి…
………………………………………………………………………………………..
మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..
Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.
ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.
Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి