pelli-taravta-dampatulu-ee-5-rakaluga-untaru-meeru-ye-rakamo

దంపతులు..కపుల్స్..ఒకరి జీవితంలో మరొకరు సగ భాగం..ఇలా ఒక జంట గురించి వివిధ రకాలుగా చెబుతుంటాం. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా సంసార జీవితం మొదలైన తర్వాత దంపతులు వివిధ రకాలుగా ఉంటారు. ఆ రకరకాల దంపతులు ఎలా ఉంటారో తెలుసుకుందాం…

1.విడదీయరాని బంధం

ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకునేవారు కొందరు, పెళ్లి తర్వాత ప్రేమించుకునేవారు కొందరు. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, సంతోషం కలిగినా, బాధ కలిగినా, కోపం వచ్చినా సరే విడదీయరాని బంధం వీరిది. ఈ దంపతుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా సరే వీరిద్దరి మధ్య ఉండే ప్రేమే వీరిని జీవితాంతం కలిసి హాయిగా ఉండేలా చేస్తుంది.

2.తికమక దంపతులు

ఏ విషయం ఎలా చేయాలి? కొత్త వారు లేదా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఎలా నడుచుకోవాలి? అంటూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించడం చివరికి కన్ ఫ్యూజ్ అవడం వీరి సంసార జీవితంలో ఉండే అతి పెద్ద వీక్ నెస్.

3.ఇద్దరికీ ఒకే అలవాటు

దంపతులంటే ఇలానే ఉండాలి, ఈ విధంగా ఉంటేనే ఆదర్శ దంపతులు అనేవి ప్రస్తుత కాలంలో ఎవరు పాటిస్తున్నారో, ఎవరికి వర్తిస్తాయో చెప్పడం చాలా కష్టం కానీ కొందరు కపుల్స్ కు మాత్రం ఇద్దరికీ ఒకే విషయం అంటే చాలా ఇష్టపడుతుంటారు. ఆ ఇష్టమే వారిని మరింత దగ్గరికి చేస్తుంది.

4.సుఖాన్ని కోరుకునేవారు

ఇద్దరు దంపతుల మధ్య మరింత బలమైన బంధం ఏర్పడాలంటే ఇద్దరు ఒకటి కావాలన్నదే ఒక విధంగా నిజమే అయ్యుండవచ్చు. రెండు శరీరాలు కలగడం కూడా సృష్టి ధర్మమే కాబట్టి ఇందులో ఎటువంటి తప్పు లేదు. ఐతే కొందరిపై జరిపిన పరిశోధనల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే తమ సంసార జీవితాన్ని మరింత సంతోషంగా ఉండటానికి చాలామంది పడకగది సుఖాన్ని కోరుకుంటున్నారు.

5.గొడవలకు కేరాఫ్ అడ్రస్

విషయం చిన్నదా?పెద్దదా? ఎందుకు గొడవపడాలి? గొడవ జరగడానికి కారణం అనేది ఏది వీరి మధ్య ఎక్కువగా కనిపించదు కానీ ఎప్పుడు మాత్రం గొడవ పడుతుంటారు. అలాగని వీరిలో బద్ధ శత్రువులు అంటూ ఎవరు ఉండరు కానీ కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య మళ్ళీ ప్రేమ చిగురిస్తుంది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఇతరుల జీవితాలను చూసి గొడవపడటం కొందరు చేస్తుంటే ఒకరికి నచ్చింది మరొకరు చేయలేదని గొడవపడేవాళ్లు ఎక్కువగా ఉన్నారు.

6.ట్రావెలింగ్ కపుల్స్

ట్రావెలింగ్ కపుల్స్ వీరికి కొత్త కొత్త ప్రదేశాలు తిరగడం, ప్రపంచాన్ని చుట్టేయడం, దూరమైన ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. సంవత్సరంలో నాలుగు ఐదు సార్లు అయినా సరే ఎక్కడికైనా వెళ్లకపోతే ఈ జీవితం ఎందుకురా బాబు అని ఫీలవుతుంటారు.

7.తిండి కపుల్స్

ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖం ఎరుగదు అనే సామెత వీళ్లకు బాగా సూట్ అవుతుంది. ఫుడ్ అంటే అంతిష్టం వీళ్లకు. ఉదయం మంచి బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం ఏ వంట చేసుకుందాం, రాత్రి డిన్నర్ కు మెనూ ఏంటని ఆలోచించుకుంటూ ఉంటారు. సో, టోటల్ గా ఫ్యామిలీ, ఫుడ్ గురించి తప్ప మిగతా విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు.

8.సినిమా పిచ్చి

కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే చాలు అప్పుడు ఆ సినిమాను ఫస్ట్ రోజే చూసే దంపతులు చాలామందే ఉన్నారు. సినిమా అంటే అంతిష్టం. చిన్న సినిమానా? పెద్ద సినిమానా అనే తేడా ఉండదు. సినిమా వస్తుందంటే థియేటర్ కు వెళ్లాల్సిందే. అలాగే హారర్ సినిమా టీవీలో వచ్చిన భయపడే కపుల్స్ కూడా ఉన్నారు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే SHARE చేయగలరు. ఇంకా ఏవైనా తెలియని విషయాలు తెలుసుకోవాలనుకుంటే COMMENT చేయండి.

ఇవి కూడా చదవండి

“మీరెప్పుడు నాతోనే ఉండాలి… “ అని మీ ఆయనకు అర్ధమయ్యేలా చెప్పడానికి చేయాల్సిన పనులు

Image Source : Stories

Leave a Reply

%d bloggers like this: