saadharana-kaanpu-jarigina-mahilalaku-matrame-arthamayye-9-vishayalu

ఒక మహిళ 9 నెలల పాటు కడుపులో బిడ్డను మోసి ఈ ప్రపంచంలోకి తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. అందుకు ఆ తల్లికి జీవితాంతం మనం కృతఙ్ఞతలు చెప్పవచ్చు. ఐతే నార్మల్ గా డెలివరీ అయిన మహిళలకు మాత్రమే అర్ధమయ్యే 9 విషయాలు చాలా వింతగా, హాస్యాస్పదంగా మరియు ప్రత్యేకంగా ఉంటాయి. అవేంటో మీరే చూడండి..

1.ఒక రోజంతా పడుతుంది

మనం సినిమాలలో చూసినట్లుగా నార్మల్ గా డెలివరీ అనేది ఏ రెండు నిముషాలో లేదా అరగంట మాత్రమే జరగదు. అన్ని సందర్భాలలో కాకపోయినా సాధారణ కాన్పుతో బిడ్డకు జన్మను ఇచ్చిన మహిళలు ఇలా జన్మనివ్వడానికి ఒక రోజైనా పట్టే అవకాశం ఉంది. బిడ్డ తల్లి గర్భం నుండి బయటకు రావడం అంటే అంత సులువు కాదు అని తెలుపడానికి ఇది ఒక్కటి చాలు.

2.నొప్పి బాధ

తల్లి గర్భం నుండి బిడ్డ బయటకు వచ్చేటప్పుడు కొందరు మహిళలలో నొప్పులు ఎక్కువగా ఉండవచ్చు మరికొందరికి ఉండకపోవచ్చు కానీ బిడ్డ బయటకు వచ్చే సమయంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు నొప్పి బాధ ఉండటం సహజమే. పవిత్రమైన మహిళ జన్మస్థానం నుండి బిడ్డకు జన్మనిస్తుంటే కంటి నుండి నీరు మరియు మరోవైపు ఆనందం అనుభవిస్తుంది.

3.మూత్రం

సాధారణ కాన్పు జరిగిన మహిళలకు ఆ శ్రమ ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. ఎక్కువ శ్రమ మరియు భయం కారణంగా కొందరిలో వారికి తెలియకుండానే మూత్రం జరుగుతూ ఉంటుంది. నార్మల్ డెలివరీ సమయంలో మీతో పాటు ఉండే వైద్యులు కొందరు చిరాకుగా ఉండేవారు ఉంటారు మరికొందరికి ఆ సమస్య తెలిసే ఉంటుంది.

4.ఆకలిగా ఉన్నా కూడా

సెజరీన్ డెలివరీతో పోల్చుకుంటే నార్మల్ డెలివరీ అనేది చాలా ఇబ్బందికరమైనదని అందరికీ తెలిసే ఉంటుంది. ఐతే ఈ సమయంలో ఎక్కువ శ్రమగా ఉండటం వలన ఆకలి కలుగుతుంది. ముఖ్యంగా చల్లటి పానీయాలు తీసుకోవాలనిపిస్తుంది. కానీ వైద్యులు ఎంత ఆకలిగా ఉన్నాసరే ఎటువంటి ఆహారం తీసుకోకూడదని చెబుతారు.

5.తల అడ్డం తిరిగిన బిడ్డ

గర్బస్త్రస్రావం నుండి బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బిడ్డ బయటకు రాగానే తల అడ్డం తిరిగినట్లుగా లేదా వంకర తలతో ఉండటం జరుగుతూ ఉంటుంది. దాని గురించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సర్దుబాటు జరుగుతుంది.

6.ఏకాంతంగా

గర్భంతో ఉన్నప్పుడు ఆ మహిళ తన భాగస్వామితో కలవడం వలన ప్రమాదకరమైన విషయమేమీ కాదు. కానీ బరువైన బాధ్యతను మోస్తూ తన భర్తకు ఆనందాన్ని కలిగించే మహిళకు హ్యాట్సాఫ్ చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఈ గర్భంతో ఉన్నప్పుడు ఈ విధంగా పాల్గొనడం వలన కడుపుపై బిడ్డపై భారం పెరిగే అవకాశం ఉంది.

7. ఆ ప్రాంతం పొడిగా ఉండటం

చాలావరకు ఈ విషయాన్ని ఎవరూ బయటకు చెప్పరు. తల్లిగా పాలిచ్చే మహిళలలో ఒక్కోసారి పాలు ఆగిపోవడం మరియు మహిళలలలో ఆ ప్రాంతం పొడిబారుతు ఉండటం జరుగుతుంది. అలాగే మొదటిసారి ఆ విధంగా పాల్గొన్నప్పుడు కూడా ఈ విధమైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.

8.సైజులో మార్పులు

సాధారణంగా ఈ విషయాలు మాట్లాడుకోవడానికి కొంచెం ఇబ్బందిపడుతూ ఉంటారు కానీ ప్రసవానికి ముందు ప్రసవం తర్వాత మహిళల ప్రైవేట్ భాగంలో కొన్ని మార్పులు సంభవించడం జరుగుతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ మార్పులు యధావిధి స్థానాలలో ఉంటాయి.

9.చాలా ఇబ్బందికరం

ఒక మహిళ అందరిముందు ఎవరికీ చూపించుకోలేని భాగాలను ఆపరేషన్ రూమ్ లో డాక్టర్స్, నర్స్, ఇంకా ఎవరో తెలియనివారి ముందు అలా ఉండాలంటే చాలా ఇబ్బందికరం మరియు కొందరు చాలా సిగ్గుగా, గిల్టీగా ఫీలవుతూ ఉంటారు. కానీ బిడ్డకు జన్మను ఇచ్చే తల్లి మనసు చాలా గొప్పది కాబట్టి అన్ని విషయాలను అర్థం చేసుకుంటుంది.

ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే SHARE చేయండి.  ఇంకా మీకు ఎటువంటి సమాచారం గురించి తెలుసుకోవాలన్నా COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

డెలివరీ గురించి మీకు ఎవ్వరు చెప్పని 7 కొత్త విషయాలు

సిజేరియన్ జరిగిన మహిళలకు మాత్రమే అర్ధమయ్యే 9 విషయాలు

Image Source : Pixabay

Leave a Reply

%d bloggers like this: