ఉరుకు పరుగుల జీవితంలో ఎదుర్కుంటున్న ఒత్తిడి, మానసిక ఆందోళనలను దూరం చేయడానికి సినిమా ఒక మాధ్యమం. తమ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రపంచంలో దాదాపు 80 శాతం మందికి పైగా సినిమాలనే ఎంచుకుంటున్నారు అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు కానీ సినిమాల ప్రభావం మాత్రం నిజ జీవితంలో బంధాలు, అనుబంధాలపై బాగానే ప్రభావితం చూపెడుతోంది.సినిమాల ప్రభావం మానవ సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపుడుతుందో చెప్పే ఆ విషయాలు మీకోసం..
1.తొలి చూపులోనే
సినిమాలలో స్లో మోషన్ లో హీరోయిన్ ఏ బస్టాప్ లోనో, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరో లేదా గుడి దగ్గర కనిపించగానే ఫస్ట్ సైట్ లవ్, తను నా కోసమే పుట్టిందిరా అని సినిమాలలో హీరో చెప్పే డైలాగులు చూస్తుంటాం. అదే పద్ధతిని చాలామంది నిజ జీవితంలోనూ ఫాలో అవుతుంటారు. కానీ అందులో నిజం లేదు, ఎందుకంటే ప్రేమ అనేది మొదటి చూపులోనే పుట్టదు అది కేవలం ఆకర్షణ మాత్రమేనని చెబితే ప్రేమ గురించి నీకేం తెలుసు అని ఎదురు ప్రశ్నించే వాళ్ళను ఎంతమందిని చూడటం లేదు.
2.కోట్ల డబ్బు క్షణాలలో
హీరోయిన్ కు ఏదైనా కష్టమొచ్చినా, ఆపదలో ఉందని హీరోకు తెలిసినా ఆ సమస్య క్షణాలలో తీరిపోతుంది. అలాగే ఎంతడబ్బు కావాలన్నా ఎలాంటి లాజిక్స్ లేకుండా కోట్ల డబ్బు హీరో తీసుకురాగలడు. కానీ నిజ జీవితంలో ఇది సాధ్యమవుతుందా? అలా సాధ్యం అయితే ఈ పాటికి మనదేశం కోటీశ్వరులతో నిండిపోయి ఉండేదేమో కదా.
3.బ్రేవ్ నెస్
హీరోయిన్ ను ఎవరైనా టీజ్ చేస్తుంటే హీరో అక్కడికి రావడం టీజ్ చేసిన వాళ్ళని ఇరగదీయడం సినిమాలలో బాగానే జరుగుతుంది. అలాగే ఇంటిమీదికి ఎవరైనా రౌడీ గ్యాంగ్స్ వచ్చినా ఒక్క ఫైట్ తో హీరో సమస్యను సాల్వ్ చేస్తాడు. అదే నిజ జీవితంలో చేయడానికి ఎంత కష్టపడాలి. అలా చేయడానికి ఎంతమందికి ధైర్యం ఉంటుంది చెప్పండి.
4.సిక్స్ ప్యాక్ బాడీ
హీరో అనగానే ఆరడుగుల ఎత్తు,దమ్ము, ధైర్యం, సిక్స్ బ్యాక్ బాడీ చూస్తారు. అలాగే అందంగా ఉండే అమ్మాయిలే హీరోయిన్ గా ఉంటారు. వీరిద్దరికి మాత్రమే ప్రేమ పుడుతుందా? కాదు కదా. అలా అనుకుంటే ప్రపంచంలో ఆరడుగుల ఎత్తు, సిక్స్ ప్యాక్ బాడీ ఉన్నవారు, అందమైన అమ్మాయిలకు మాత్రమే పెళ్ళిళ్ళు అవుతాయ్.
5.ప్రేమ, పెళ్లి, హనీమూన్
ప్రేమ పెళ్లి హనీమూన్ అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేవి కానీ సినిమాలలో చూపించినట్లుగా ప్రేమించిన వాళ్ళు ఇంట్లో ఒప్పించడానికి, తమ ప్రేమను గెలవడానికి, పెళ్లి దాకా తీసుకెళ్లడానికి ఎన్నో కష్టాలు పడుతుంటాడు. కథ సుఖాంతం కాగానే తమ ప్రేమతో పెద్దల మనసు గెలుచుకుని పెళ్లి చేసుకోవడం ఏ ఫారెన్ కో హనీమూన్ వెళ్లడం జరుగుతుంది. కానీ రియల్ లైఫ్ లో మాత్రం ప్రేమించుకున్న వాళ్ళలో ఎంతమంది తమ ప్రేమను తమ పెద్దలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారో, ప్రేమలో గెలిచి పెళ్లిళ్లు చేసుకుంటున్నారో మీరు చూస్తూనే ఉంటారు.
సినిమా అనేది నిజజీవితంలో జరిగే కొన్ని యదార్థ సంఘటనలతో తెరెకెక్కినా అన్ని విషయాలు అలాగే జరగవు. సినిమాను సినిమాగానే చూస్తేనే బెటర్. సినిమాలను, నిజ జీవితంతో మానవ సంబంధాలతో ముడిపెట్టుకుంటే ఆనందం దూరమవుతుంది అని చెప్పడానికే ఇదంతా.
ఈ ఆర్టికల్ మీకు నచ్చ్చినట్లయితే LIKE చేయండి, SHARE చేయండి. మీకు ఎటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలన్నా మాకు COMMENT చేయవచ్చు.
ఇవి కూడా చదవండి
పెళ్లి తర్వాత దంపతులు ఈ 5 రకాలుగా ఉంటారు : మీరు ఏ రకమో తెలుసుకోండి..!