పిల్లలు చిరుతిండ్లను ఇష్టపడుతారు. అయితే పిల్లలకు మీరు ఇచ్చే చిరు తిండ్లలో, కొంచెం పోషక విలువలు కూడా అందేటట్టు చూసుకోవాలి . అందుకే మీ పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే, హెల్త్ మిక్స్ సత్తు మావు లడ్డు ఎలా తయారు చేసుకోవాలో….. మీ కోసం అందిస్తున్నాం. ఈ వీడియోలో చూడండి…
Video Credits : My little Moppet
కావాల్సిన పదార్ధాలు
సత్తు మావు మిక్స్ – 1 కప్
సత్తు మావు మిక్స్ మార్కెట్ లో రెడీమేడ్ గా దొరుకుతుంది. మీరే తయారు చేసుకోవాలనుకుంటే, సత్తు మావు మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ లింక్లో చూడండి..
బెల్లం – ⅓ కప్
నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం
ముందుగా సత్తు మావు మిక్స్ ను, వేయించండి. పొడిగా అయ్యి, మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి
తరువాత వేయించిన మిక్స్ ని, ఒక బౌల్ లో తీసిపెట్టుకోండి.
బెల్లానికి నీరు కలిపి, పాకం పట్టుకోండి
తరువాత బెల్లం పాకాన్ని వేయించిన మిక్స్ తో కలిపి, అందులో నెయ్యి వేసి, మొత్తం మిశ్రమాన్ని మెత్తగా కలుపుకోండి.
దీనిని మీకు కావాల్సిన సైజులో, లడ్డులుగా చేసుకోండి.
ఈ హెల్త్ మిక్స్ సత్తు మావు లడ్డులను, మీ పిల్లలకు రోజు ఇవ్వండి. అవి పిల్లల బలాన్ని, శక్తిని పెంచి ఎదుగుదలకు తోడ్పడుతాయి.
అందరికి తప్పకుండా SHARE చేయండి
ఇవి కూడా చూడండి
చిన్న పిల్లలు ఇష్టంగా తినే, బలవర్ధకమైన చికెన్ వంటకం: ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి…
పిల్లలు బరువు పెరగడానికి ప్రోటీన్ లడ్డు: తయారు చేసే విధానం ఈ వీడియోలో చూడండి