టాంపూన్ అంటే?

చిత్రంలో ఉన్న మూడిటి వివరాలు
1.అప్లికేటర్ తో టాంపూన్
2. ఓపెన్ చేసాక టాంపూన్
3. మీ యోని లోకి వెళ్లే భాగం
టాంపూన్స్, మీరు పీరియడ్స్ సమయంలో వాడే ప్యాడ్స్ లానే, మీ బహిష్టు రక్తాన్ని పీల్చుకుంటుంది. వీటిని మెత్తని దూదితో, స్థూపాకారం (cylindrical) లో తయారు చేస్తారు (పై చిత్రంలో చూడచ్చు). టాంపూన్ ను లోపలికి పెట్టడానికి అప్లికేటర్. దీనిని సులువుగా యోనిలో పెట్టుకోవచ్చు. బహిష్టు రక్తాన్ని యోని నుండి బయటకు రాకుండా, టాంపూన్స్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
టాంపూన్ ఎలా వాడాలి?

స్టెప్ 1 :
మీ చేతులు శుబ్రంగా కడుక్కోండి. యోని భాగంలో టాంపూన్ పెట్టుకునేటప్పుడు మీ చేతులు మురికిగా ఉండకూడదు. క్రిములు, బాక్టీరియా యోని లోకి వెళ్ళే ప్రమాదం ఉంది.
స్టెప్ 2 :
టాంపూన్ ను రేపర్ నుండి బయటకు తీయండి. అయితే మీరు బయటకు తీసే సమయంలో చేతులు పొడిగా ఉండాలి. ఒక వేళ టాంపూన్ కింద పడితే, ఆ టాంపూన్ ను వాడధ్ధు.
స్టెప్ 3 :
టాంపూన్ యోని లో కి పెట్టుకునే ముందు మీకు వీలైన భంగిమలో కూర్చోండి లేదా నిలబడండి. ఎక్కువ వీలు గా ఉండడానికి టాయిలెట్ సీట్ మీద కూర్చోండి.

స్టెప్ 4 :
టాంపూన్ ను మీరు రాసే వేళ్ళతో పట్టుకోండి. టాంపూన్ యోనిలోకి పెట్టిన తరువాత తాడు భాగం బయటకు కనపడేలా ఉండాలి.
స్టెప్ 5 :
మీ యోని ద్వారాన్ని గుర్తించండి. మహిళల యోని ఈ కింది చిత్రం లో చూపించిన విధంగా ఉంటుంది.

స్టెప్ 6 :
మీ యోనిలోపలకి టాంపూన్ ను పంపించండి.
స్టెప్ 7:
మీ చూపుడు వేలుతో అప్లికేటర్ పై ఒత్తితే టాంపూన్ యోని లోకి వెళ్తుంది.
స్టెప్ 8 :
బొటనవేలును, చూపుడు వేలును ఉపయోగించి, అప్లికేటర్ ను బయటకు తీసేయండి.
టాంపూన్ వాడే పద్దతిని మహిళలందరికీ SHARE చేయండి. ఆరోగ్యాంగా ఉండండి.