ఒక అమ్మ తన కొడుక్కిచ్చిన భరోసా ఈ ప్రపంచాన్నే వెలుగులోకి నడిపించిన గొప్ప శాస్త్రవేత్తను తయారుచేసింది

థామస్ అల్వా ఎడిసన్, మానవ జాతిని వెలుగులోకి నడిపించిన గొప్ప శాస్త్రవేత్త. ఆ గొప్పతనంలో భాగం తన అమ్మ, నాన్సీ మాథ్యూస్ ఎడిసన్ కూడా ఉంది. ఈ ప్రపంచానికే శాస్త్ర రంగంలో ఒక దశ దిశా చూపించిన గొప్ప శాస్త్రవేత్త, అమ్మ దిద్ధించిన అక్షరాలతోనే తన విద్యను ప్రారంభించాడు. ఎడిసన్ కు బాల్యంలో ADHD అనే మానసిక సమస్య తో బాధపడేవాడు. దీని కారణంగా అందరి పిల్లలా కాకూండా, చదవడానికి, విషయాలను అర్ధం చేసుకోడానికి చాలా కష్టపడే వాడు. అలాంటి ఒక్క అబ్బాయి, 1000 పైగా పేటెంట్ హక్కులతో ఈ ప్రపంచాన్నే మార్చ కలిగిన ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఎలా మారాడు? కాదు తన అమ్మ ఎలా మార్చింది…. అందుకు ఈ సంఘటనే నాంది…

ఒక రోజు ఎడిసన్, స్కూల్ నుంచి ఒక ఉత్తరం తీసుకొచ్చి అమ్మ చేతికిచ్చాడు. ఆ ఉత్తరం తన టీచర్ ఇచ్చింది. ఎడిసన్ గురించే ఏదో రాసి వుంది. తన అమ్మకు ఆ ఉత్తరం ఇచ్చి, అందులో తన గురించి తన టీచర్ ఏమి రాసిందా!! అనే ఆతృతతో, అమ్మ వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు. అమ్మ ఉత్తరాన్ని మెల్లగా తెరిచి, తనలో తాను చదవడం మొదలు పెట్టింది. ఎందుకో ఆ ఉత్తరం చదివేటప్పుడు తన కళ్ళ నిండా నీళ్ళు. ఎదురుగా ఎమీ జరుగుతుందో తెలియక అమాయకంగా చూస్తున్న తన కొడుకు. తన ఏడుపును సముదాయించుకుని, కళ్ళు తుడుచుకుంది. ఆ ఉత్తరాన్ని కొడుక్కి కూడా వినిపించేలా బిగ్గరగా చదవడం మొదలుపెట్టింది.

“ మీ కొడుకు చాలా తెలివైన వాడు! అతనికి చదువు చెప్పేంత గొప్ప టీచర్లు మా స్కూల్లో లేరు. అందుకని ఇక నుండి మీ కొడుకు కి మీరే చదువు చెప్పండి. స్కూల్ కు పంపించాల్సిన అవసరం లేదు”

తన అమ్మ నోటి నుండి ఈ మాటలు విన్నాక ఎడిసన్ చాలా సంతోషించాడు. తన మీద తనకు చాలా నమ్మకం కలిగింది. ఆ రోజునుండి ఇంట్లోనే తన అమ్మ పర్వేక్షణలో చదువుకోవడం ప్రారంభించాడు. అన్ని విషయాల గురించి అమ్మ సహాయంతో, చాలా ఆసక్తితో తెలుసుకునే వాడు. చాలా చిన్న వయసులోనే తన సొంత ప్రయోగశాలను ఏర్పాటుచేసుకుని, తన సొంత ప్రయోగాలను చేసేవాడు. తరువాత ప్రపంచం లోనే అత్యంత గొప్ప శాస్త్రవేత్తగా అతను లికించిన చరిత్ర ప్రపంచానికి మొత్తం తెలిసిందే

తను గొప్ప శాస్త్రవేత్త అయ్యి, అమ్మ చనిపోయిన కొన్ని రోజుల తర్వాత, ఆమె బీరువాలో తన చిన్నప్పుడు టీచర్ రాసిన ఉత్తరం, ఎడిసన్ కు కనపడింది. చాలా ఉత్సాహంతో ఆ ఉత్తరాన్ని చదవడం ప్రారంభించాడు. ఆ ఉత్తరం చదివాక ఎడిసన్ కుప్పకూలిపోయి, తన అమ్మను తలుచుకుంటూ ఏద్వడం మొదలుపెట్టాడు.

ఆ ఉత్తరం లో నిజంగా ఉన్న విషయం ఇది…

“మీ కొడుకు ఒక పిచ్చివాడు, తెలివిలేని వాడు. అతనికి చదువు చెప్పడం మా వాళ్ల కాదు. ఇక నుంచి అతనిని స్కూల్ కు పంపించకండి”

ఆ రోజు ఆ ఉత్తరాన్ని మార్చి చదివి, తన కొడుకు భరోసాను ఇచ్చి, ఒక మేధావిగా మార్చి, ఈ ప్రపంచానికే ఉపకారం చేసింది. నాన్సీ మాథ్యూస్ ఎడిసన్ .

అందుకే అమ్మే ఈ ప్రపంచానికి తోలి గురువు…. ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు ప్రపంచాన్ని ముందుకు నడిపే కొడుకులను,కూతుర్లను తయారుచేసిన అమ్మలందరికి పాదాభివందనం…

తప్పకుండా అందరికి SHARE చేయండి… మీ పిల్లల చేత చదివించండి

ఇవి కూడా చదవండి

ఫేస్బుక్ వ్యయస్థాపకుడు మార్క్ జుకెర్ బెర్గ్ తన చిన్న కూతురుకు భావోద్వేగంతో రాసిన లేఖ: మీకోసం తెలుగులో

గర్భంలో ఉన్న బిడ్డ రాసిన లేఖ నేరుగా తల్లి గుండెల్లోకి చేరింది

Leave a Reply

%d bloggers like this: