పిల్లలు స్నాక్స్ తినడం ఇష్టపడుతారు. మీరు దానిని కాదనలేరు. కానీ సమస్యల్లా, పిల్లలు స్నాక్స్ గా తీసుకునే ఆహారంలో, చాలా వారకు బయట దొరికే ఆహార పదార్ధాలే ఉంటాయి. వీటిని ఎలా తయారు చేస్తారో, ఏమి కలుపుతారో, తింటే ఏమవుతుందో అనే కంగారు ప్రతి తల్లికి ఉంటుంది. అందుకే పిల్లలకు తినడానికి ఇంట్లోనే ఏదైనా చేసి ఇవ్వడం మంచిది. అందుకే పిల్లల కోసం బ్రేడ్ కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి..
కావాల్సిన పదార్ధాలు
బ్రెడ్ – 5
ఆలు – 3
క్యాప్సికమ్ ముక్కలు – పావు కప్పు
ఆనియన్ ముక్కలు – పావు కప్పు
పచ్చి మిర్చి – 1 స్పూను
పసుపు – అర స్పూను
కారం – అర స్పూను
అల్లం పేస్ట్ – 1 స్పూన్
గరం మసాలా – అర స్పూన్
కొత్తిమీర
తయారు చేసే విధానం
1. ముందుగా ఆలును ఉడకపెట్టి, మెత్తగా చేసి పెట్టుకోండి.
2. తరువాత బ్రెడ్ చివరి భాగాలను తొలిగించి. మిగతా బ్రెడ్ ను ముక్కలుగా చేసి ఒక బౌల్ లోకి తీసుకోండి.
3. ఆ బౌల్ లో, అన్ని కలుపుకొని, పిండిలా చేసుకోండి.
4. ఆ పిండిని ముద్దలుగా చేసుకుని, వత్తి, నూనెలో వేయించుకోండి.
ఇవి పిల్లలకు సాయంత్రం స్నాక్స్ గా ఇవ్వచ్చు.
ఈ తయారీ విధానాన్ని, అందరికి SHARE చేయండి
ఇవి కూడా చూడండి
పిల్లల ఎదుగుదలకు తోడ్పడే హెల్త్ మిక్స్ (సత్తు మావు) లడ్డు : తయారీ విధానం ఈ వీడియోలో చూడండి
చిన్న పిల్లలు ఇష్టంగా తినే, బలవర్ధకమైన చికెన్ వంటకం: ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి…