పాదాల పగుళ్లను పోగొట్టే సహజసిద్ధమైన గృహ చిట్కాలు

వర్షపు నీటిలో తడిసినప్పుడు, దుమ్ము, ధూళి ఎక్కువగా చేరినప్పుడు, శరీర వేడి కారణంగా చాలామంది పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే మరికొందరిలో అయితే పాదాల పగుళ్లు మాత్రమే కాకుండా పగుళ్ల నుండి చీము, నెత్తురు కూడా వస్తుంటాయి. అయితే ఇక్కడ చెప్పుకునే సింపుల్ హోమ్ రెమెడీస్ ను మీ ఇంటి వద్ద నుండే ఉపయోగించడం వలన ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.

1.పసుపు

కాలి పగుళ్లతో ఇబ్బందిపడేవారు రాత్రి పడుకునేముందు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు కలిపి పగిలిన పాదాలను పది నిముషాల పాటు ఇందులో ఉంచాలి. ఆ తర్వాత వైట్ పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పగుళ్ల సమస్య నుండి విముక్తి లభిస్తుంది.

2.గోరింటాకు

శరీరంలో వేడి వలన కొన్నిసార్లు కాళ్ళ పగుళ్లకు కారణం కాబట్టి గోరింటాకును బాగా నూరుకుని పగిలిన పాదాలపై రాసుకోవడం వలన ఈ సమస్యకు వెంటనే గుడ్ బై చెప్పేయవచ్చు.

3.నిమ్మరసం

బయట నుండి ఇంటికి వచ్చిన తర్వాత లేదా పడుకునేముందు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని అందులో పగిలిన పాదాలను ఉంచుకోవాలి. ఆ తర్వాత పొడిబట్టను తీసుకుని పాదాలను బాగా తుడుచుకుని మాయిశ్చరైజర్ రాసుకోవడం వలన రిలీఫ్ గా ఉంటుంది. లేదా నిమ్మకాయను రెండు ముక్కలుగా చేసుకుని పాదాలు పగిలిన చోట మర్దనాగా చేయడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఐతే ఈ విధంగా చేయడం వలన కొంచెం మంటగా ఉన్నా ఉపశమనం మాత్రం బాగా ఉంటుంది.

4.అలోవెరా జెల్

అలోవెరా జెల్ ను సర్వరోగ నివారిణిగా చెప్పుకోవచ్చు. అందాన్ని పెంచే ప్రతి క్రీములోనూ అలోవెరా జెల్ ను ఉపయోగిస్తున్నారు. కాలి పగుళ్ల చోట అలోవెరా జెల్ ను అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. లేదా పసుపు, తులసి , కర్పూరం సమానంగా తీసుకుని వీటికి అలోవెరా జెల్ కలిపి పగిలిన పాదాలపై రాయడం వలన పగుళ్ల సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

5.అరటిపండు

అరటిపండు తొక్కలను తీసుకుని బాగా గుజ్జుగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పగిలిన పాదాలపై అప్లై చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా చేసుకోలేని వారు అరటి తొక్కలను తీసుకుని రాత్రి పడుకునేముందు పగిలిన పాదాలపై పెట్టి ప్లాస్టర్ వేసుకుని పడుకోవడం వలన ఉదయానికే తేడా గమనించవచ్చు.

6.కీరా జ్యుస్

పాదాల పగుళ్ల నుండి విముక్తి కలిగించే మరొక గృహ చిట్కా కీరా జ్యూస్. కీర దోసకాయను ముక్కలుగా చేసుకుని బాగా జ్యూస్ గా తయారు చేసుకోవాలి. ఇందులో కాస్త బియ్యపు పిండి కలిపి పగిలిన పాదాలపై రాసుకుని ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పైన చెప్పుకున్న వాటిలో అన్నిటినీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీకు ఏది సులువుగా అనిపిస్తే అది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చెప్పుకున్నది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే అందరికీ SHARE చేయగలరు. ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే LIKE చేయండి.

Leave a Reply

%d bloggers like this: