ముఖంపై ముడతలను తగ్గించే ఇంటి చిట్కాలు

ఎవరిలోనైనా సరే వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు, కళ్ళ కింద నల్లటి వలయాలు, ముఖంపై మచ్చలుగా ఏర్పడటం సర్వసాధారణమే. మనం తీసుకునే ఆహరం, సరైన నిద్రలేకపోవడం వలన, మానసిక ఒత్తిడి కారణంగా తక్కువ వయసులోనే కొందరు ఈ సమస్యను ఎదుర్కుంటూ ఉంటారు. అయితే చాలా తక్కువ ఖర్చుతో సింపుల్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చెప్పుకునే గృహ చిట్కాలను పాటించడం వలన ముఖంపై ముడతలు తగ్గి ప్రకాశవంతమైన అందమైన ముఖం మీ సొంతం అవుతుంది.

1.బంగాళా దుంప రసం

బంగాళా దుంప రసాన్ని దూదితో కంటికింద రాసుకున్న లేదా ప్రతి రోజూ బంగాళా దుంప రసంతో ముఖం కడుక్కోవడం చేయడం వలన ముఖంపై ముడతలు సమస్య నుండి బయటపడవచ్చు.

2.గుడ్డు

గుడ్డులోని తెల్లసొనను బయటకు తీసి ముఖంపై పూతగా వేసుకోవాలి. కొన్ని నిముషాలు అయ్యాక ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వలన ముడతలు తగ్గుతాయి. రెగ్యులర్ గా కాకపోయినా రెండు వారాలకొకసారి ఈ విధంగా చేసుకోవచ్చు.

3.అరటిపండు

ఒక స్పూన్ తేనె, రెండు స్పూన్ల పెరుగు మరియు ఒక అరటిపండును తీసుకోవాలి. ముందుగా అరటిపండును బాగా నుజ్జుగా చేసుకుని అందులో తేనె మరియు పెరుగు కలుపుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై ప్యాక్ గా వేసుకుని ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మీరే ఆ ఫలితం చూడవచ్చు.

4.బొప్పాయి గుజ్జు

మన ఇంటి పెరటిలో లభించే బొప్పాయి పండుతో ముఖం కాంతివంతంగా అందంగా మెరిసేలా చేసుకోవచ్చు. బొప్పాయి పండును బాగా గుజ్జుగా చేసి ముఖంపై మెత్తగా మర్దనా చేస్తూ రాసుకోవాలి. బాగా ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

5.శనగపిండి

శనగపిండిలో కొద్దిగా నీరు కలిపి ముఖంపై స్మూత్ గా మర్దనా చేసుకుని చల్లని నీటితో శుభ్రం చేసుకోవచ్చు లేదా నీటికి బదులుగా రోజ్ వాటర్ కానీ పెరుగు కానీ ఉపయోగించవచ్చు.

6.పాలు -నిమ్మరసం

ఒక టేబుల్ స్పూన్ చల్లని పాలు తీసుకుని అందులో రెండు మూడు చుక్కల నిమ్మరసం కలిపి మిక్స్ చేసుకోవాలి. రాత్రి పడుకునేముందు ముఖంపై పూతగా అప్లై చేసుకుని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వలన అందమైన, కాంతివంతమైన ముఖం మీ సొంతం అవుతుంది.

పైన చెప్పుకున్న వాటిలో అన్నిటినీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీకు ఏది సులువుగా అనిపిస్తే అది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చెప్పుకున్నది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే అందరికీ SHARE చేయగలరు. ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే LIKE చేయండి.

Leave a Reply

%d bloggers like this: