ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (Ectopic Pregnancy) వస్తే పిల్లలు పుడుతారా??

ప్రెగ్నెన్సీ అనేది ఎన్నో చిత్రమైన, భయంకరమైన అనుభవాల కలయిక. అందులో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది చాలా కీలకమైనది. ఎక్టోమిక్ ప్రెగ్నెన్సీ అంటే, పిండం యుటరస్ భాగంలో అభివృద్ధి చెందకుండా ఫాలోపియన్ ట్యూబ్ దగ్గర అభివృద్ధి చెందితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటారు. దీనినే ట్యూబల్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటారు. కొన్ని సార్లు పిండం ఓవరీని కూడా ఆక్రమిస్తుంది. ఇలాంటి సమయంలో వెంటనే డాక్టర్‌ను కలవడం చాలా మంచిది.

ప్రతి 50 గర్భాలలో ఒకటీ ఎక్టోమిక్‌గా మారుతుందని ఒక సర్వేలో తేలిన నిజం. అయితే ఎక్టోపిక్ గర్భాన్ని గుర్తించడానికి కనీసం 8 వారాలు ఆగాల్సిందే. ఎక్టోమిక్ ప్రెగ్నెన్సీలో బేబీ బతకడం అన్నది చాలా కష్టం. అయితే, ఇందులో ఆశావహ దృక్పతం ఏమిటంటే, ఎక్టోమిక్ ప్రెగ్నెన్సీ వచ్చినా తరువాతి ప్రెగ్నెన్సీ సాధారణంగానే ప్రసవం జరుగుతుంది.

లక్షణాలు

– వెజినా దగ్గర బ్లీడ్ అవ్వడం,

– వికారంగా ఉండటం,

– కడుపులో తిమ్మిరి, నొప్పిగా ఉండటం,

– ఎక్కువ అలసటగా ఉండటం.

ఎందుకు జరుగుతుందంటే,

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఫాలోపియన్ ట్యూబ్స్‌లో ఇబ్బంది తలెత్తడం వల్ల జరుగుతుంది. ఫాలోపియన్ ట్యూబ్స్ పిండాన్ని యుటెరస్ భాగంలోకి పుష్ చేయలేకపోవడం వల్ల జరుగుతుంది. యుటెరిన్ డీవైజెస్ వాడటం వల్ల, సుఖ వ్యాధులు రావడం వల్ల జరుగుతుంది. లేటు వయసులో గర్భం దాల్చడం వల్ల, పెల్విక్ భాగంలో ఆపరేషన్ జరగడం వల్ల కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది.

చికిత్స

ఇలాంటి ప్రెగ్నెన్సీని తొందరగా కనుక్కోవడం ద్వారానే సులభంగా అరికట్టవచ్చు. కనుక్కున్న తర్వాత అల్ట్రాసౌండ్ ద్వారా దీన్ని పరిష్కరించవచ్చు. ఫాలోపియన్, ఐవరీలు ఇబ్బందికి గురైనా సర్జరీ ద్వారా బాగుచేయవచ్చు.

ఒకవేల మొదటి దశలోనే గుర్తిస్తే, ల్యాప్రోస్కపిక్ సర్జరీ ద్వారా డ్యమేజ్‌ను తగ్గించవచ్చు. ఒక్కోసారి గర్భాన్ని పోగొట్టుకోవల్సి వస్తుంది. సర్జరీ అయిన తర్వాత కూడా ఫాలో అప్ చేస్తూ క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేస్తూ ఉండాలి.

అయితేఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఎప్పుడూ ఇలానే జరగదు. మీరు త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమౌతారు కాబట్టి దీని గురించి ఆందోలన చెందాల్సిన అవసరం లేదు. 

Leave a Reply

%d bloggers like this: