చిన్నపిల్లలో జలుబు, దగ్గు, జ్వరం తగ్గించడానికి సహజ చిట్కాలు : ఇవి చాలా బాగా పనిచేస్తాయి..

చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ఒక తల్లిగా మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారికి ఏదో ఒక జబ్బు వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా వారికి దగ్గు, జలుబు, జ్వరం వంటి రోగాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. వాటిని తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటంటే,

స్పాంజ్ బాత్

స్పాన్ బాత్ చేయడం వల్ల కూడా శరీరంలోని వేడిని చాలా వరకు తగ్గించవచ్చు. రోజుకు 2 సార్లు స్పాంజ్ బాత్ చేయడం చాలా మంచిది.

విశ్రాంతి

పిల్లలకు ఆరోగ్యం బాగా లేనప్పుడు ఎంత ఎక్కువ విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది. ఎక్కువ విశ్రాంతి తీసుకుంటే జెంస్‌తో పోరాడే శక్తి పెరుగుతుంది.

వేపర్ రబ్

బేబి చెస్ట్ దగ్గర, గొంతు కింద, మెడ భాగంలో వేపర్ రబ్ చెయడం మంచిది. ఇలా చేస్తే వారికి అక్కడ ఉన్న నొప్పి తగ్గడమే కాక, శ్వాస బాగా అందుతుంది.

జిలకర 

క్యారం సీడ్స్‌ను బాగా ఉడకబెట్టి ఆ సూప్‌ను పిల్లలకు తాగించడం వల్ల దగ్గు, జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు.

గార్లిక్-జిలకర

క్యారం సీడ్స్ మరియూ గార్లిక్ పేస్ట్‌ను బాగా ముద్ద చేసి బేబి పడుకున్న చోట పెట్టడం వల్ల అక్కడ ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది. అయితే ఈమిశ్రమాన్ని ముఖానికి దగ్గరగా పెట్టకపోవడం మంచిది.

మెత్తని అహారం

మెత్తని ఆహారం ఇవ్వడం వల్ల ముక్కు దిబ్బడ చాలా వరకు తగ్గిపోతుంది కాబట్టి తినడానికి సులువుగా అనిపించే ఆహారం ఇవ్వడం మంచిది.

హ్యుమిడిఫయర్

హ్యుమిడిఫైర్ పెట్టడం వల్ల ఆ ప్రాంతంలో ఉండే గాలి వెచ్చగా మారుతుంది దీంతో బేబీకి చలి సోకకుండా ఉంటుంది.

స్టీమ్

స్టీమ్ ఎయిర్ పెట్టడం వల్ల గది మొత్తం వెచ్చగా అవుతుంది. దీని వల్ల బేబి హాయిగా ఉంటుంది. అంతేకాక, ఇతర రోగాలు దరి చేరకుండా ఉంటాయి.

కాఫ్ డ్రాప్స్

దగ్గు తగ్గడానికి ఉపయోగించే కాఫ్ డ్రాప్స్ వేయడం వల్ల గొంతు దగ్గర ఉండే ఇబ్బంది తొలగిపోతుంది. దీంతో పిల్లలు హాయిగా నిద్రపోతారు.

పుక్కిలించడం

వేడి నీళ్ళతో లేదా ఉప్పునీళ్ళతో పుక్కిలించడం ద్వారా నోటి దగ్గర ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది. దీంతో బేబి తొందరగా కోలుకుంటుంది.

లెమన్

లెమను జ్యూస్‌కు కొన్ని చుక్కలు తేనే కలిపి తాగించడం వల్ల శరీరంలో హైడ్రేషన్ పెరిగి జలుబు, దగ్గు వంటివి తగ్గుముఖం పడతాయి.

పాలు

మీ పిల్లలకు ఇచ్చే పాలల్లో కొంచెం పసుపు కలపాలి. పసుపు యాంటీ యాక్సిడెంట్‌గా పని చేసి జలుబును దూరం చేస్తుంది.

తేనె-అల్లం

తేనే మరియూ అల్లంను నీటిలో కలిపి తాగించడం వల్ల జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.

కుంకుమ

పిల్లలు తాగే పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు కలపడం వల్ల పిల్లలో రోగనిరోధక శక్తి పెరిగి తొందరగా జలుబు, జ్వరం, దగ్గు వంటి వ్యాధుల నుండి విముక్తులవుతారు.

Leave a Reply

%d bloggers like this: