ప్రగ్నెన్సీతో ఉన్నప్పుడు ప్రతి డాక్టర్ మీకు చెప్పాలనుకొనే 9 విషయాలు

ప్రెగ్నెన్సి గురించి మనకు తెలిసిన దాని కంటే తెలియనిదే ఎక్కువ. అయితే మీరు ప్రెగ్నెన్సీ గురించి ఎన్నోసార్లు డాక్టర్‌ను కలుస్తారు. అయితే డాక్టర్లు కూడా మీరు కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుందని అనుకుంటారు. అవేంటంటే,

నెట్‌లో శోధించడం

చాలా మందికి ఏదైనా సమస్య ఉంటే వెంటనే నెట్‌లో చూడటం అలవాటుగా ఉంటుంది. కాబట్టి, మీకు తలెత్తే ఇబ్బంది కోసం దయచేసి నెట్‌లో చూడకండని వారు కోరుకుంటారు. ఎందుకంటే, నెట్‌లో రాసేవారు దాని మీద కనీస అవగాహన లేకుండా రాస్తారు కాబట్టి, ఇలా ప్రతి దానికీ నెట్‌లో చూడకపోవడం మంచిదని డాక్టర్లు బావిస్తారు.

అన్నిటీకీ యాంటీబయోటిక్స్

ఒంట్లో కొంచెం బాగలేదని అనిపిస్తే వేంటనే యాంటీబయోటిక్ వాడుతారు. అలా చేయడం వల్ల వ్యాధి తొందరగా తగ్గుతుంది కానీ రోగ నిరోధక శక్తి పెరగదు కాబట్టి, మీరు ప్రతి దానికీ మాత్రలు వాడటాన్ని వారు సమర్థించరు.

జ్వరం గురించి ఎక్కువ ఊహించుకోవడం

చాలా మంది చిన్న పిల్లల్లో జ్వరం రావడం అనేది చాలా సాధారణ విషయం. దీనికే గాభరా పడిపోయి బేబీకి ఏవంటే అవి మందులు వేయకండి. పిల్లల్లో రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్ల తరచుగా జ్వరం వస్తుంది. జ్వరంతో పాటూ వేరే సంకేతాలు కనిపిస్తేనే మీరు వైద్యుని దగ్గరకు వెళ్ళాలని డాక్టర్లు అనుకుంటారు.

వాక్సిన్ మీకోమే

పిల్లలకు వేసే వ్యాక్సిన్ మీ కోసమే అని గుర్తించాలి. ఎక్కువ రేట్ ఉందని మేము కావాలని చెప్తున్నామని అపోహ పడకండి. మేము వైద్య వృత్తి కోర్స్ చేసి వచ్చామని గుర్తించి చెప్పిన మందులు వాడాలని వైద్యులు అనుకుంటారు.

క్యూ-టిప్స్ వాడటం

మీరు బేబీ చెవులలో ఉండే దుమ్మును తీసివేద్దామని క్యూ టిప్స్ వాడుతారు కానీ అది మంచి కన్నా చెడే ఎక్కువ చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ క్యూ టిప్స్ లేదా యియర్ బడ్స్ వాడకండని డాక్టర్స్ కోరుకుంటారు.

రాత్రిపూట కాల్ చేయడం

మీరు ఎంత రాత్రి పూట అయిన మాకు కాల్ చేయవచ్చు. ఎందుకంటే ఈ వృత్తిలోకి వచ్చిందే అందుకోసం. మీకు ఉన్న బాధే మాకు కూడా మీ పిల్లల మీద ఉంటుంది కాబట్టి మీరు రాత్రి పూట కూడా మాకు కాల్ చేయవచ్చని డాక్టర్లు అనుకుంటారు.

రెగులర్ చెకప్స్

పిల్లలకు రెగులర్ చెకప్స్ చేస్తే బాగుంటుందని డాక్టర్స్ అభిప్రాయపడతారు. ఇలా చేయడం వల్ల చాలా రోగాలను మొదట్లోనే ఆపవచ్చు. చికిత్స కన్నా ముందు జాగ్రత్త చాలా ఉత్తమం అని వారు నమ్ముతారు కాబట్టి రెగులర్ చెకప్స్ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడతారు.

వరీ కాకండి

తల్లిదండ్రులు తక్కువ వరీ అయితే డాక్టర్ల మీద తక్కువ ఒత్తిడి ఉంటుంది. మీరు ఎక్కువ ఇబ్బంది పడి మమ్మల్ని కూడా కూడా ఇబ్బంది పెట్టకండి అని చాలా మంది డాక్టర్లు అంటారు. మీరు ఒత్తిడి కలిగించకపోతే మేము చికిత్స బాగా చేయగలమని డాక్టర్లు అంటారు.

మేము కూడా పిల్లల్ని ప్రేమిస్తాము

మీ పిల్లల్ని మీరు ఎంతగా అయితే ప్రేమిస్తారో అంతే విధంగా మేము కూడా ప్రేమిస్తాము అని డాక్టర్లు చెప్తారు. ఆసుపత్రిలో ఏవైనా వస్తువులను పగులగొట్టినా, మా మాట వినకపోయినా కూడా మేము ఓపికతో భరిస్తాము అని చాలా మంది డాక్టర్లు చెప్తారు.

Leave a Reply

%d bloggers like this: