కండోమ్ ఉపయోగించకుండా గర్భం రాకుండా ఉండాలంటే..?

కొత్తగా పెళ్ళైన దంపతులు ఇప్పుడప్పుడే పిల్లలను వద్దనుకుంటూ ఉంటారు. అయితే శృంగారంలో ఆనందంగా గడపాలని వారికి కోరికగా ఉంటుంది. అటువంటప్పుడు గర్భం రాకుండా ఉండాలంటే వారికి వచ్చే ఆలోచన కండోమ్ ఉపయోగించడం. ఈ విధంగా చాలామంది చేస్తుంటారు. కానీ ఎక్కడో చిన్న అనుమానం కండోమ్ ఉపయోగించినా కూడా గర్భం వస్తుందేమోనన్న భయం ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పుకునే ఈ టిప్స్ పాటించడం వలన గర్భం రాకుండా నిరోధించవచ్చు. గర్భం రాకుండా నిరోధించే ఆ టిప్స్ ఏవో మీరే చూడండి.

1.కాపర్ ‘T’

శృంగారంలో పాల్గొన్నా కూడా గర్భం రాకుండా చేయడంలో కాపర్ T కీలకపాత్ర పోషిస్తుంది. చూడటానికి చిన్న సైజులోనే ఉన్నా దీని ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. COPPER T ఒక గర్భాశయ పరికరం. ఇది గర్భాన్ని నోరోధించడానికి స్త్రీల యోనిలో అమరుస్తారు. ‘T’ ఆకారంలో వుండే ప్లాస్టిక్, రాగి(copper)తో చుట్టబడివుంటుంది. లోపల సన్నని తీగ ఉంటుంది. దీనిని యోనిలో అమర్చిన తరువాత, గర్భాన్ని నిరోదిస్తూ కొన్ని సంవత్సరాలు పాటు అలానే ఉంటుంది.COPPER T ను యోని భాగం లో అమర్చిన తరువాత, రాగి అయాన్లు (Copper ions) గర్భాశయ ద్రవాల్లో కలిసిపోతాయి. ఇవి గర్భాశయానికి ఏ హాని చేయవు. కానీ పురుష వీర్యాన్ని ప్రవేశించకుండా నిరోధిస్తాయి. దాని ద్వారా గర్భం నిరోధించబడుతుంది. COPPER T గర్భ నిరోధక రేటు 99%. చాలా దేశాలలో దీనిని మహిళలు వాడుతున్నారు.

2.అప్పుడు శృంగారం చేయకూడదు

స్త్రీ గర్భం దాల్చడం అనేది సాధారణంగా ఆమె ఋతుచక్రం మీదనే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు స్త్రీ ఒకటవ తేదీ బహిష్టు ఐతే 12 నుండి 16 తేదీల మధ్యలో అండం విడుదల అవుతుంది. అందుకని వీలైనంత వరకు దంపతులు ఈ మధ్య కాలంలో శృంగారంలో పాల్గొనకపోతే చాలు గర్భం రాకుండా నిరోధించవచ్చు.

3.స్కలనం జరగకుండా

దంపతుల మధ్య శృంగారం జరుగుతున్నప్పుడు ఒకానొక సమయంలో వీర్య స్కలనం జరుగుతుంది. అటువంటప్పుడు గనుక వీర్య స్కలనం యోనిలోకి జరగకుండా చేయగలిగితే మాత్రం గర్భం నిరోధించడానికి ఆస్కారం ఉంది కానీ అది సులువైన విషయం కాదు. ఐతే స్కలనం జరగకుండా ఒకరిపై ఒకరు ప్రేమను పంచుకుంటూ ఫోర్ ప్లే చేసుకుంటూ శృంగారం చేసుకుంటే గర్భం రాకుండా నిరోధించుకోవచ్చు.

4.గర్భనిరోధక మాత్రలు

గర్భం రాకుండా నిరోధించడానికి ప్రస్తుతం మార్కెట్ లో వివిధ రకాల మందులు, గర్భ నిరోధక మాత్రలు లభిస్తున్నాయి. వీటిని తీసుకోవడం వలన గర్భం రాకుండా నిరోధించవచ్చు. ఐతే ఇలా మందులు వాడటం వలన ఆరోగ్యానికి మంచిది కాదు అని వైద్యులు సైతం అంటున్నారు.

ఈ ఆర్టికల్ పై మీ COMMENT కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే LIKE & SHARE చేయండి.

ఇవి కూడా చదవండి.

ప్రెగ్నన్సీ సమయంలో సెక్స్ గురించి ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి

Leave a Reply

%d bloggers like this: