ముక్కు సైజును బట్టి మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు

చేతి రేఖలు, వేలి పొడవు, జాతకాలు, పుట్టిన తేదీ, జాతకాలు..ఇలా మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకునే ఉంటారు. అయితే ముక్కు సైజును బట్టి మీ వ్యక్తిత్వం ఏంటో, మీరు ఎలాంటివారో తెలుసుకోండి.

పెద్ద ముక్కు

పెద్ద ముక్కు అంటే ముక్కు షార్ప్ గా, రంధ్రాలు పెద్దవిగా ఉంటాయి. ఇటువంటి వారు ఒకరికింద బ్రతకడం కన్నా సొంతంగా ఎదగడానికి ఇష్టపడతారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువ. నేను చేయగలను అనే నమ్మకం, ఏ సమస్య ఎదురైనా పోరాడగలను అనే స్వభావం కలిగిన వారు.

చిన్న ముక్కు

వీరు అందరి కలిసి ఉండటానికి ఇష్టపడతారు. లైఫ్ అంటే ఎంజాయ్ చేయడం అని భావించే టైప్. అలాగే కొంచెం షార్ట్ టెంపర్. ఏదైనా సమస్య వస్తే వాటికి దూరంగా ఉండాలనుకుంటారు, వ్యక్తిగతంగా మీద వేసుకోరు. ఇతరుల పట్ల ప్రేమ మరియు ఎమోషన్ ను వెంటనే చూపిస్తారు.

పొడవైన ముక్కు

ఇటువంటి ముక్కు కలిగిన వారు బిజినెస్ రంగంలో బాగా రాణించగలరు. ఏ పనిచేసినా సరే బిజినెస్ మైండ్ సెట్ తో ఆలోచిస్తూ ఉంటారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి బాగా కృషి చేస్తారు. వీళ్ళ నాయకత్వ లక్షణాలను తన సహచరులు మెచ్చుకుంటూ ఉంటారు. వీరి ఉన్నత ఆశయాలే వీరి ప్రధాన బలం.

వంకర లేని చక్కగా ఉండే ముక్కు

ఇలాంటి వారు చాలామందికి ఆదర్శంగా నిలిస్తుంటారు. వీరు చేసే పనిపట్ల వీరికి అంకితభావం ఎక్కువ. ఏ పని చేసినా అది పూర్తి చేసేవరకు వదిలిపెట్టరు. సమస్య వచ్చినప్పుడు వదిలి వెళ్లే రకం కాదు. సెంటిమెంట్స్ కు విలువఇస్తారు కానీ ఎప్పుడు జరిగిపోయిన వాటి గురించి అస్సలు పట్టించుకోరు.

విశాలమైన లేదా వెడల్పు ముక్కు

విస్తారమైన ముక్కు కలిగిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అప్పుడప్పుడు వీరి వ్యక్తిత్వం మారుతూ ఉంటుంది. ఆధునికంగా జీవించడానికి ఇష్టపడతారు. వీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. వీరితో కలిసి పనిచేయడం అంటే ఇతరులు ఇష్టంగా ఉంటారు.

మెలితిరిగిన ముక్కు

ముక్కు పెద్దదిగా ఉండి మెలితిరిగిన లేదా వంకరగా ఉండి ఒక స్లోప్ గా ఉంటే దయ కలిగిన వారు మరియు ఆశావాదులు. ఇతరుల పట్ల ప్రేమ ఎక్కువగా ఉంటుంది. పక్కవాళ్ళు చేసే పనిలో సపోర్ట్ గా నిలుస్తారు అలాగే ప్రోత్సహిస్తూ ఉంటారు.

కట్టిపడేసినట్లుగా ఉండే ముక్కు

ముక్కు పై భాగంలో స్లోప్ గా ఉండి ముందుకు వచ్చేసరికి పొడవుగా ఉంటే పెద్ద ముక్కు స్వభావం కలిగినవారు. అయితే వీరు ప్రతి విషయానికి చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటారు. అలాగే ఇతరులు చెప్పే విషయాలను శ్రధ్దగా వినడం, వారి ఆలోచనలకు మర్యాద ఇవ్వడం చేస్తుంటారు.

బొద్దుగా ఉండే ముక్కు

ముక్కు అంతా పొడవుగా ఉండి ముందు భాగంలో మాత్రం కొంచెం ఉబ్బినట్లుగా ఉంటుంది. వీరు చాలా వేగంగా ఆలోచిస్తారు అంతే వేగంగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వీరు చాలా తెలివైనవారు. వారి పనిలో జోక్యం చేసుకున్నా, ఇష్టం లేకుండా ప్రవర్తించినా వెంటనే ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది.

రంధ్రాలు చిన్నవిగా ముక్కు లావుగా

ఇటువంటి వారు కుటుంబం ఫ్రెండ్స్ అంటే ప్రేమ ఎక్కువ. ప్రతి విషయానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. శృంగారం పట్ల ఆలోచనలు ఎక్కువగానే ఉంటాయి.

గ్రీక్ నోస్

ఇటువంటి ముక్కు కలిగిన వారు ఇండిపెండెంట్ గా జీవించడానికి ఇష్టపడతారు. అలాగే కష్టం అని ఎవరైనా వస్తే వారికి సహాయం చేయకుండా ఉండలేరు. వీరి ఆలోచనలు చాలా క్రియేటివిగా ఉంటాయి. ఇష్టమైన రంగంలోనే సక్సెస్ సాధించేవరకు కష్టపడతారు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే LIKE & SHARE చేయండి.

ఇవి కూడా చదవండి.

పుట్టిన నెలను బట్టి చిన్న పిల్లల వ్యక్తిత్వం

Leave a Reply

%d bloggers like this: