పసిపిల్లలు ఏ రంగులో ఉన్నా సరే చిన్నతనంలో చాలా ముద్దుగా ఉంటారు. అయితే వయసు పెరిగేకొద్దీ పిల్లల అందంలో, రంగులో మార్పు వస్తుంటుంది. వయసు పెరిగిన తర్వాత అందంగా లేమోనని ఫీలవకుండా ఉండాలంటే తల్లితండ్రులు ఇలా చేస్తే సరిపోతుంది.
1.పెసరపిండి పాలమీగడ
ఒక స్పూన్ పాలమీగడ, కొద్దిగా పసుపు మరియు పాలమీగడను ఒక చిన్న గిన్నెలో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు రాసి, ఆరిన తర్వాత స్నానం చేయిస్తే మంచి ఫలితం ఉంటుంది. 3 నెలల తరవాత పిల్లలకు ఈ విధంగా చేయించాలి.
2.పాలు శనగపిండి
ఒక స్పూన్ శనగపిండి, ఒకటి లేదా రెండు స్పూన్ల పచ్చి పాలు మరియు కొద్దిగా పసుపు తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని పిల్లల శరీరంపై రాసి ఆరిన తర్వాత ఒక క్లాత్ లో శుభ్రం చేయాలి లేదా స్నానం అయిన చేయించవచ్చు. పచ్చిపాలు బాక్టీరియా,ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆగగలదు.
3.వేడి నూనెతో మసాజ్
ఇది ఎప్పటినుండో మన పెద్దలు పాటిస్తున్నదే. పిల్లల శరీరానికి కొన్ని బేబీ ఆయిల్స్ ఉన్నాయి. వాటిని కాస్త వేడి చేసి, గోరు వెచ్చగా ఉన్నప్పుడు పిల్లల శరీరానికి మసాజ్ చేయడం వలన పిల్లలకు రిలాక్స్ గా ఉండటమే కాకుండా ఎముకలకు మంచిది. ప్రకాశవంతమైన చర్మం పిల్లలకు వస్తుంది.
4.స్నానానికి వాడే నీరు
పిల్లలకు ఎప్పుడూ స్నానం చేయించినా సరే చల్లగా ఉండే నీరు, మరీ వేడి ఎక్కువగా ఉండే నీరు ఉపయోగించకూడదు. ఇలా చేయడం వలన పిల్లల చర్మం దెబ్బతింటుంది. రంగులో మార్పు వస్తుంది. అందుకే నీరు వేడిగా ఉన్నాయో లేదో ఒక్కసారి మీరు చూసి స్నానం చేయించాలి. గోరు వెచ్చగా ఉన్న నీటిని వాడటం మంచిది.
5.సబ్బులు, నూనెలు
పిల్లల అందాన్ని పెంచడానికి ఈ సబ్బులు, ఆయిల్స్ బాగా ఉపయోగపడతాయి అని చూస్తూనే ఉంటారు. వాటిలో కెమికల్స్ ఉండటం చర్మం దెబ్బతినడం లేదా రంగులో మార్పు వస్తుంది కాబట్టి సహజమైన పద్ధతులు పిల్లలు పెద్దయ్యే వరకు పాటించడం మంచిది. ఇంకా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల వరకు సబ్బు వాడకపోవడం మంచిది.
6.ఫ్రూట్ జ్యూస్
అందరి ఇళ్లలో పిల్లలందరికీ ఈ విధంగా చేయించడం పెద్ద రిస్క్ కాదేమో. తాజా ద్రాక్ష పండ్ల నుండి గుజ్జు తీసి మెత్తగా శరీరంపై రాసి ఆరిన తరవాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయిస్తే మంచిది. అలాగే ఆరంజ్ మరియు ఆపిల్ పండ్లతో చేయించవచ్చు. వీటి రసం తాగించినా పిల్లలకు మంచిదే. అయితే 3 నెలల తర్వాత పిల్లలకు ఈ విధంగా చేయించాలి.
ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.
ఇవి కూడా చదవండి.
అప్పుడే పుట్టిన పిల్లలతో ఎప్పుడు చేయకూడని 6 పనులు : చేస్తే చాలా ప్రమాదం….