ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడంటే వయసు పెరిగిన తర్వాత జుట్టు రాలడం ఉండేది కానీ, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. మహిళలలో జుట్టు రాలకుండా అందంగా, ఒత్తుగా ఉండేందుకు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది.
గుడ్డు
జుట్టు బలంగా, వేగంగా పెరగడానికి రెండు గుడ్లు తీసుకుని వాటిని పగలగొట్టి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకుని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. లేదా గుడ్డు పచ్చని సొనలో ఒక స్పూన్ హెయిర్ ఆయిల్, రెండు స్పూన్ల నీటిని కలిపి తలకు రాసుకొని ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
తేనె
జుట్టు అందంగా ఉంచడంలో మరో సహజమైన పధ్ధతి తేనెను ఉపయోగించడం. గుడ్డు తెల్లసొనలో కొద్దిగా తేనె కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 20 నిముషాల తర్వాత బాగా క్లీన్ చేసుకుంటే అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది.
మెంతులు
రాత్రి పడుకునే ముందు రెండు టేబుల్ స్పూన్ల మెంతులను తీసుకుని నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని నీటి నుండి వేరుచేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. కావాలంటే ఇందులో కొబ్బరినూనెను కూడా కలుపుకోవచ్చు. తలస్నానానికి వెళ్లే అరగంటముందు ఈ పేస్ట్ ను జుట్టుకు రాసుకుని గోరువెచ్చని క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఈ 3 సహజమైన పద్ధతులు పాటించడం వలన జుట్టు వేగంగా పొడవుగా పెరగడమే కాకుండా అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది.
ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.
ఇవి కూడా చదవండి.