తల్లిలో పాలు తగ్గడానికి కారణాలు ఇవే..తల్లి పాలు వృద్ధి చెందటానికి ఇంటి చిట్కాలు

పిల్లలకు తల్లిపాలు ఆరోగ్యకరం అని అందరికీ తెలిసిందే. దాదాపు 6 నెలల పాటు బిడ్డకు తల్లిపాలు తప్పనిసరి. అయితే కొందరు తల్లులలో పాలు సరిపడాలేక మదనపడుతుంటారు. దీనికి కారణం ప్రగ్నెన్సీ టైంలో వారు సరైన పోషకాహారం, ఐరన్ ఫుడ్స్ తక్కువగా తీసుకోవడమే కారణం. ఇక్కడ చెప్పుకునే ఈ చిట్కాలను ఫాలో అవ్వడం వలన తల్లిపాలు సమృద్ధిగా పడతాయి.

నట్స్

తల్లిపాలు వృద్ధి చెందాలంటే ప్రోటీన్స్,విటమిన్స్ మరియు మినరల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. వీటిలో బాదం, జీడిపప్పు తీసుకోవడం వలన తల్లి పాలు సమృద్ధిగా పడతాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి రోగ నిరోధకశక్తిని పెంచుతుంది మరియు తల్లిపాలు వృద్ధి చెందటానికి ఉపయోగపడుతుంది. అందుకని తప్పనిసరిగా మీరు తీసుకునే ఆహారంలో వెల్లుల్లి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

ఓట్ మీల్

కొత్తగా తల్లి అయిన పాలు, తల్లిపాలు బిడ్డకు సరిపోవడం లేదని మదనపడేవారు ప్రతిరోజూ ఓట్ మీల్ ను తీసుకోవడం చేయాలి. ఓట్ మీల్ శరీరంలోని ఆక్సిటోనిన్ ఉత్పత్తి చేసి తల్లి పాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

బ్రౌన్ రైస్

కొత్తగా తల్లి అయిన వారికి శరీరానికి కావాల్సిన శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకని బ్రౌన్ రైస్ ఆహారంగా తీసుకోవడం వలన ఎనర్జీ లెవల్స్ పెంచడమే కాకుండా తల్లిపాలు బాగా పడేలా చేయడంలో సహాయపడుతుంది మరియు ఆరోగ్యానికి మంచివి కూడా.

ప్రసవం తర్వాత

ప్రసవం అయిన 6 గంటల తర్వాత నుండి బిడ్డకు పాలు పట్టించడం సరిగ్గా తాగేలా చూసుకోవడం వలన స్తన్యం బాగా ఉత్పత్తి అవుతుంది.

నీరు & పాలు

ఎప్పుడు కూడా నీటిని కాచుకుని చల్లారిన తర్వాత తీసుకోవాలి. అలాగే ప్రతిరోజూ తల్లి శ్రేష్టమైన 2 లీటర్ల ఆవు పాలు తాగడం చేయాలి. 2 లీటర్లు కుదరదు అనేవారు కనీసం ఒక లీటర్ పాలు అయినా తాగితే వారికి మరియు పిల్లలకు మంచిది.

సాల్మన్ ఫిష్

తల్లిపాలు బాగా వృద్ధి చేయడంలో సాల్మన్ ఫిష్ బాగా సహాయపడుతుంది. ఎందుకంటే వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన తల్లి పాలు బాగా పడేలా దోహదపడతాయి.

వ్యాయామాలు

తేలికపాటి వ్యాయామాలు చేయడం వలన తల్లి పాలు వృద్ధి చెందుతాయి. అలాగే నీరు ఎక్కువగా తీసుకోవాలి. సరైన నిద్ర విశ్రాంతి కూడా అంతే అవసరం.

ఈ ఇంటి చిట్కాలను పాటించడం వలన తల్లి పాలు బాగా వృద్ధి చెంది, మీ పిల్లల ఆకలి తీర్చడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వారవుతారు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి. 

అప్పుడే పుట్టిన పిల్లలతో ఎప్పుడు చేయకూడని 6 పనులు : చేస్తే చాలా ప్రమాదం….

Leave a Reply

%d bloggers like this: