దసరా రోజు ప్రతి మహిళ ఇది తెలుసుకుంటే ఆ ఇంట్లో ఎప్పటికీ సిరి సంపదలు

హిందువులు తెలుగువారు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. ఈ పండుగనే నవరాత్రులు, శరన్నవరాత్రులు అని పిలుస్తారు. దేశం అంతటా ఆనందోత్సాహాలతో జరుపుకునే అమ్మవారి పండుగ విశిష్టత గురించి, అమ్మవారి అవతారాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

పురాణాల ప్రకారం విజయదశమిని జరుపుకోవడానికి కారణాలు ఏంటంటే రాముడు రావణుడిపై గెలిచిన సందర్భం, అలాగే పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. అందుకని ఈ రోజున రావణ వధ చేయటం, జమ్మి చెట్టును పూజించడం జరుగుతోంది. విజయదశమిని పురష్కరించుకుని అమ్మవారి అవతారాల గురించి, విశిష్టత గురించి తెలుసుకుందాం.

శైలపుత్రి అవతారం

సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే తనకు భర్తగా రావాలని హిమవంతుడికి పుత్రికగా జన్మించిన అమ్మవారే శైలపుత్రి. ఈమె వాహనం ఎద్దు. బాలచంద్రశేఖరున్ని ధరించి, చేతిలో ప్రతి శూలాన్నీ చేతబట్టి తన వాహనమైన ఎద్దుపై కూర్చుని ఉంటుంది. మానవులలో చురుకుదనం, మంచి జీవితాన్ని ప్రసాదించాలని సూచికగా అమ్మవారిని కొలుస్తారు.

బ్రహ్మచారిణి అవతారం

నారద మహర్షి ఉపదేశం ప్రకారం ఈశ్వరుడిని పతిగా పొందేవరకు నిద్రాహారాలు మాని ఘోరతపస్సు చేసిన అమ్మవారు. ఈ అమ్మవారికి అపర్ణ అనే పేరు కూడా ఉంది. ఆకులు కూడా తినకుండా ఘోరతపస్సు చేసినందుకు ఈ పేరు వచ్చింది. బ్రహ్మచారిణి అమ్మవారిని ప్రార్థించడం వలన విజయాలు సిద్ధిస్తాయి.

చంద్రఘంట అవతారం

శిరస్సుపై ధరించిన అర్ధ చంద్రుడు అర్ధాకృతలో ఉండటం వలన ఈ అమ్మవారికి చంద్రఘంట అనే పేరు వచ్చింది. ఎటువంటి ఆపదలలోనైనా, ఎటువంటి సమస్యలున్నా సరే ఈ అమ్మవారిని తలచుకుంటే నేనున్నాను అంటూ అభయమిస్తుంది.

కూష్మాండ అవతారం

ఈ అమ్మవారినే అష్ట భుజాదేవి అని కూడా పిలుస్తారు. ఎనిమిది చేతులలో విల్లు, బాణం, గద, చక్రం, కలశం, కమలములతో పులిని వాహనంగా చేసుకుని కూర్చుని ఉంటారు.

స్కందమాత అవతారం

స్కందుని తల్లి (కుమారస్వామి) కాబట్టి స్కందమాత అని భక్తులు పిలుచుకుంటారు. తనని నమ్మిన భక్తులకు ఎల్లవేళలా అమ్మవారు తోడుగా ఉంటారు.

కాత్యాయని అవతారం

మహిషాసురుడ్ని వధించిన అమ్మవారే కాత్యాయని అమ్మవారు. పార్వతీ దేవి తనకు బిడ్డకు జన్మించాలని కొత్స అనే మహాఋషి తపస్సు చేయగా జన్మించిన అమ్మవారు కాత్యాయని అమ్మవారు. మహిషాసురుడిని అంతం చేసేందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవిని సృష్టించగా, ఈ కాత్యాయని అమ్మవారిని పూజిస్తారు. ఈ అమ్మవారే మహిషాసురుడిని వధించడం జరిగింది.

కాళరాత్రి అవతారం

ఈ అమ్మవారినే శుభంకరి అని పిలుస్తారు. చేసే ప్రతి పనిలో శుభం కలగాలని కోరుకుంటే అమ్మవారు ఎప్పటికీ తోడుగా ఉంటూ అంతా మంచే జరిగేలా చేస్తారు. అమ్మవారి మేని ఛాయ చీకటిగా ఉంటుంది కాబట్టి కాళరాత్రి అవతారంగా కొలవడం జరుగుతోంది.

మహాగౌరి అవతారం

పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి ఈ అమ్మవారు ఘోర తపస్సు చేయగా అమ్మవారి శరీరం నల్లని దేహంగా మారుతుంది. ఆమె ఘోర తపస్సుకు మెచ్చి గంగాజలంతో అమ్మవారిని ప్రక్షాళన చేయగానే గౌరవర్ణ విద్యుత్ కాంతులతో అమ్మవారి శరీరం వెదజల్లుతూ ఉంటుంది. ఆ తర్వాత నుండే అమ్మవారిని మహాగౌరిగా పిలవడం జరుగుతోంది.

సిద్ధిధాత్రి అవతారం

ఈ అమ్మవారు అన్ని సిద్ధులను ప్రసాదిస్తారు. ఆ పరమేశ్వరుడు సైతం అమ్మవారి కృపతోనే అన్ని సిద్ధులనూ పొందాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఇవండీ అమ్మవారి 9 అవతారాల వెనుక ఉన్న అసలు రహస్యం.

ఈ దసరా రోజున అమ్మవారి అవతారాల గురించి, దసరా విశిష్టత గురించి చెప్పుకోవడం వలన ఎంతో పుణ్యఫలం. లోక కళ్యాణం కోసమే ఒక్కో అవతారంలో అమ్మవారు ఒక్కో అవతారం ధరించారు. అందుకే విజయదశమిని మనం ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు. 

Leave a Reply

%d bloggers like this: