మీ పిల్లలు ఓటమి చవిచూడకుండా ఉండాలంటే చేయాల్సిన 6 పనులు

మీ పిల్లలు జీవితంలో ఏదైనా సాధించాలంటే వారి పైన వారికి ఎంతో నమ్మకంతో పాటూ జీవితం మీద ఆశావహ దృక్పథం కూడా ఉండాలి. జీవితం మీద మంచి అవగాహన ఉన్నప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలరు. కొందరి పిల్లలు జీవితం మీద నిరాశావాద దృక్పథాన్ని ఏర్పరచుకొని ఉంటారు. అలాంటి పిల్లలను మార్చే బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంటుంది. అలాంటి వారిని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవేంటంటే..

పాజిటివ్‌గా

కొన్ని కొన్ని సార్లు మనం ఎంత బాగా ఉన్నా చెడ్డ అనుభవాలు ఎదురౌతాయి. అలాంటి సమయాలలో పాజిటివ్‌గా ఎలా ఆలోచించాలో మీ పిల్లలకు నేర్పించండి. అందులో జరిగిన చిన్న మంచిని లేదా పాఠాన్ని మీ పిల్లలు చూసేలా మీరు ప్రోత్సహించండి. ఇలా చేయడం వల్ల వారు భవిష్యత్తులో ఆశావాహంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తారు.

చాడీలు

ఏ పిల్లలైతే చాడీలు చెప్తారో వారు నెగటివ్‌గా ఆలోచిస్తున్నారని చెప్పవచ్చు. కాబట్టి మీ పిల్లలు చాడీలు చెప్పడాన్ని మీరు అస్సలు ప్రోత్సహించకండి. చాడీలు చెప్తున్నప్పుడు వారిని వారించండి. దీని వల్ల వారు ఇతరులలో నెగటివ్స్‌ను చూడటం తగ్గిస్తారు.

చిన్న చిన్న టాస్క్స్

మీ పిల్లలు విజయవంతంగా పూర్తి చేసేలా కొన్ని టాస్క్స్ ఇవ్వండి. వాటిలో ఉండే చాలెంజ్‌ను ఫేస్ చేస్తూ టాస్క్ పూర్తి చేయడం వల్ల వారికి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. దీంతో వారు మరిన్ని కష్టమైన పనులు చేయడానికి ముందుకు వస్తారు.

ఆత్మవిశ్వాసం

మీ పిల్లలకు కొంతమేర స్వేచ్చను ఇవ్వడం మంచిది. ఇలా చేయడం వల్ల వారిలో సృజనాత్మకత పెరగడమే కాక వారు చేసే పనుల వల్ల వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తద్వారా వారికి ఆశావహ ఆలోచనాశైలి పెరుగుతుంది.

కొన్నిటికి దూరంగా

మీ పిల్లలకు మీ ఆర్థిక, ఆరోగ్య సమస్యల గురించి సరైన వయసు వచ్చేవరకు అస్సలు చెప్పకండి. ఒకవేళ చెప్తే, ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో లేదా వచ్చాయో వారికి అర్థం కాదు దీంతో వారికి జీవితం మీద చెడ్డ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది.

సమస్యలు

వారికి ఉన్న వయసు దృష్ట్యా ఏ సమస్య వచ్చినా డీలా పడిపోతూ ఉంటారు. అలాంటి సమయాలలో తల్లిదండ్రులుగా మీరు వారికి సమస్యలన్నిటికీ పరిష్కారం ఉంటుందని చెప్పాలి. ముందుగా సమస్య పట్ల వారి దృక్పథాన్ని, అబిప్రాయాన్ని మార్చాలి. చిన్న చిన్న సమస్యలను వారే పరిష్కరించుకునే విధంగా వారిని ప్రోత్సహించాలి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

మీ పిల్లలకు రోజు చెప్పాల్సిన 7 విషయాలు

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: