కండోమ్ వాడినా కూడా గర్భం వచ్చే అవకాశం ఉందా?

కండోమ్, నిజానికి ఒక సాధారమైన వస్తువు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో అసాధారణమైన మార్పులు తీసుకొచ్చింది. సురిక్షితమైన శృంగారాన్ని అనుభవించడానికి సహాయపడుతుంది. గర్భనిరోధకంగా ఎక్కువ శాతం కండోమ్ నే వాడుతారు. కానీ కండోమ్ పూర్తిగా, ప్రతిసారి గర్భాన్ని నిరోధించగలదా? కండోమ్ వాడినా కూడా గర్భం దాల్చడానికి కారణాలు, అవకాశాలు ఇక్కడ తెలుసుకుందాం.

1. కండోమ్ల ప్రభావం

మీరు సెక్స్ లో పొల్గొనేటప్పుడు కండోమ్ వాడితే, అది గర్భాన్ని 98% నిరోధిస్తుంది. అంటే మీరు కండోమ్ వాడినా కూడా మీకు గర్భం వచ్చే అవకాశం 2 శాతం ఉంటుంది. దానికి కారణాలు, సెక్స్ చేసే సమయంలో కండోమ్ చినిగిపోవడం, తయారీ లోపాలు లాంటివి కావచ్చు.

2. సరిగా వాడకపోవడం

చాల మంది కండోమ్ వాడడం సులభం అని అనుకుంటారు. కానీ కాదు. అంగానికి కండోమ్ ను తొడుగుకున్నాక, వీర్యానికి కొంత స్పేస్ ఉండేటట్టు చూసుకోవాలి.

3. భంగిమ

ఏదైనా కష్టతరమైన భంగిమలో, కండోమ్ తో శృంగారంలో పొల్గొంటున్నప్పుడు, కండోమ్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

4. లూబ్రికేషన్

సెక్స్ సమయంలో లూబ్రికేషన్ కోసం వాడే ఆయిల్స్, క్రీమ్స్ కండోమ్ ను బలహీనపరుస్తాయి. కండోమ్ రబ్బర్ పలచబడి సరిగా పని చేయకపోయే అవకాశం.

5. నిల్వ

కండోమ్ ను ఎక్కడంటే అక్కడ చాలా రోజులు వరకు అలానే పెట్టి, దాన్ని సెక్స్ సమయంలో వాడడం మంచిది కాదు. మరి ఎక్కువ వేడిగా వుండే ప్రదేశంలో ఉంచితే అవి పాడైపోవచ్చు. ఇలా పాడైపోయిన కండోమ్ వాడితే గర్భం వచ్చే అవకాశం ఉంటుంది.  

Leave a Reply

%d bloggers like this: