వర్షా కాలం పిల్లలకు వచ్చే జబ్బులను ఇంట్లోనే నయం చేసే ఆయుర్వేద చిట్కాలు

వానా కాలం వచ్చేసింది. వానలు పేదలకు చిన్నలకి, చల్లదనాన్ని సంతోషాన్ని పంచుతాయి. వానల చిరు జల్లుల్లో తడిచి ఆనందాన్ని పొందాలని అందరికి ఉంటుంది. కానీ వర్షాలు వీటన్నిటితో పాటు క్రీములను, ఇన్ఫెక్షన్స్ ను, జబ్బులను కూడా మోసుకొస్తాయి. పిల్లలు వీటి బారిన ఎక్కువగా పడుతుంటారు. ఎంత కాపాడుకున్న రోగాలు తప్పకుండా వస్తాయి. ఆ వానా కాలం రోగాలను నయం చేసే ఆయుర్వేద చిట్కాలు ఇక్కడ చూడండి…

1. దగ్గు, జలుబు జ్వరం

కారణం:

వాన కాలంలో గాలిలో ఉండే ఇన్ఫ్లుఎంజా వైరస్ (Influenza virus) ఈ జబ్బులకు కారణం. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఇతరులకు కూడా అంటుకుంటుంది. పసి పిల్లలకు ఎక్కువగా వస్తుంది.

వైద్యం:

అల్లం రసం + గోరు వెచ్చని నీరు + 1 చెంచా తేనే , బాగా కలిపి రోజులో అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి.

2. విరేచనాలు

కారణం :

తాగే నీటి ద్వారా వైరస్, బాక్టీరియా కడుపులోకి చేరడం విరేచనాలు అవ్వడానికి కారణం. అవి జీర్ణ వ్యస్థను మందగింప చేస్తాయి. పిల్లలు కడుపునొప్పి, వాంతులు, డిహైడ్రాషన్, విరేచనాలతో బాధపడతారు.

వైద్యం :

నిమ్మ రసం + దానిమ్మ రసం

దానిమ్మ పూర్తిగా కడుపునొప్పిని, విరేచనాలను తగ్గిస్తుంది. 6 నెలల లోపు పిల్లలకు గింజలు పెట్టకండి. గొంతులో అడ్డు పడే ప్రమాదం ఉంటుంది .

3. కళ్ళ కలక

కారణం :

వర్షా కాలంలో ఎక్కువగా ఉండే బాక్టీరియా, వైరస్ కళ్ళ కలకకు కారణం. ఏది వచ్చినప్పుడు, పిల్లల కళ్ళు ఎర్రగా మారిపోతాయి, కంటి నుండి పుసి కారుతుంటుంది.

వైద్యం :

 

ఉప్పు నీళ్ళతో కడగడం. కళ్ళ కలకకు ఇదే ఉత్తమమైన వైద్యం. వేడి నీళ్లలో కళ్ళు ఉప్పును కలిపి, దానితో పిల్లల కళ్ళను కడగండి.

4. డెంగీ

కారణం :

డెంగీ జ్వరం ఏడెస్ (AEDES) అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ రకం దోమలు వానా కాలంలో ఎక్కువగా వస్తాయి. వీలున్నంత వరకు వీటి బారిన పడకుండా పిల్లలను కాపాడుకోవడం మంచిది.

వైద్యం :

తులసి ఆకులను నీళ్ళలో వేసి కాసేపు మరగనివ్వండి. ఈ నీటిని పిల్లలకు ఇస్తూ ఉండండి. అంతే కాకుండా ఆకులను పిల్లల చేత నమిలించండి.

5. చర్మ వ్యాధులు

కారణం :

వానా కాలంలో అధికంగా వ్యాపించే క్రీములు, పిల్లలకు ఇన్ఫెక్షన్ లు కలిగించి, చర్మ వ్యాధులకు కారణమవుతాయి.

వైద్యం :

పసుపు + వేపాకు పేస్ట్

దీనికి సరైన పరిష్కారం వేపాకు. వేపాకులో ఎన్నో వైద్య గుణాలు ఉంటాయి. పసుపు వేపాకు కలిపిన పేస్ట్ ను ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రాంతంలో పూయండి.

Leave a Reply

%d bloggers like this: