బరువు ఎక్కువగా ఉన్నారని బాధపడటమనేది అర్థంలేనితనం!!

మహిళలు ఎక్కువగా ఆందోలన చెందే విషయం ఏంటంటె వారి బరువు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆమె బరువుకు సంబందించే కామెంట్స్ చేస్తారు. శరీరం మొత్తం ఆకర్షనీయంగా ఉన్నప్పటికీ ఎదో విధంగా ఇబ్బంది పెడతారు. ఈ సమాజం మహిళలను వారి శరీరాన్ని బట్టి అంచనా వేయడం, విలువ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చాలా అసహ్యించుకోవల్సిన పరిణామం. ఒక వ్యక్తిని ఆత్మను బట్టీ కాకుండా శరీరాన్ని బట్టి అంచనా వేయడం నిజంగా దారుణమైన విషయం. ఈ విషయం  మీద కొందరు తమ అభిప్రాయాలను మాతో పంచుకున్నారు…

1. ఎంత బాధగా ఉంటుందో తెలుసా  

మాకు ఎందుకు వేదన కలుగుతుందంటే, మా శరీరం గురించి ఇతరులు ఏమనుకుంటారో అనే అందోలన వల్లే. మేము మా టీనేజ్‌లో ఇతరుల నుండి వచ్చే కామెంట్స్ వల్ల చాలా ఇబ్బందులు పడతాము. దీని నుండి మేము స్వాంతన పొందడానికి చాలా ప్రయత్నిస్తాము.

2. మాకు చెప్పద్దు 

మేము ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ చాలా కట్టుబాట్లు పెడతారు. దురదృష్టవశాత్తూ మేము ఆ కట్టుబాట్లకు బానిసవుతాము. ఆ కట్టుబాట్లన్నీ సమాజం నుండీ, ఫ్రెండ్స్ నుండీ, అప్పుడప్పుడూ కుటుంభం నుండి కూడా ఎదురవుతాయి. ఇవన్నీ మహిళా సెలబ్రిటీలకు కూడా వర్తిస్తాయి. ప్రతి సృజనలోనూ అందాన్ని, మంచిని మనం, మన చుట్టూ ఉన్న సమాజం వేతకలేవన్నది వాస్తవం.

3. ఆరోగ్య సమస్యలు 

మహిళలు బరువు పెరిగేది పర్‌ఫెక్ట్‌గా లేకపోవడం వల్ల కాదు వారి ఆరోగ్య సమస్యల వల్ల అన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. ఒకవేల మనం నిజంగా లావుగా ఉన్నా ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి. మనలో ఉన్న ప్రతి అనువునూ మనం ప్రేమించాలి. బయటివారు ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని మనం పక్కన పెట్టాలి అప్పుడే మనం సమర్థవంతంగా ముందుకు వెళ్ళగలం.

4. తమ లావైన శరీరం  గురించి వచ్చిన మాటలు లేదా కామెంట్స్ కొన్ని ఇలా ఉంటాయి.

– ‘నువ్వు ఫ్యాట్‌గా ఉన్నావ్’ అని ఎక్కువగా అన్నది మా అమ్మ మాత్రమే అని ఒక మహిళ చెప్పింది.

– మగవారి లావు వచ్చే సమస్యలతో పోలిస్తే ఆడవారికి చాలా అధికం.

– ‘నేను నా లిప్స్ మీద ముడుతలు చూసుకున్నప్పుడు, నా స్కిన్‌లో కాంతి కోల్పోయినప్పుడు, నా శరీరానికి అనవసర ఒంపులు వచ్చినప్పుడు నన్ను నేను ఇష్టపడను. అలాంటి సమయంలో నేను అందంగా ఉన్నానని అస్సలు అనిపించదు అని’ ఒక మహిళ చెప్పింది.

– ‘మంచి వాతావరణం ఉన్నప్పుడు నాకు షార్ట్స్ చేసుకోవాలని ఉంటుంది కానీ కుదరదు ఎందుకంటే, నా శరీరం అందంగా ఉండదు కాబట్టి’ అని ఒకామె చెప్పింది.

– ‘శరీరం పెరగడం, తరగడం అన్నది మన చేతుల్లో ఉండదు, అది వారి ఆరోగ్య పరిస్థితిని బట్టీ హెచ్చుతగ్గులు ఉంటుంది’.

కాబట్టి మీరు బరువు ఎక్కువ ఉన్నా కూడా పట్టించుకోకుండా, ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. 

Leave a Reply

%d bloggers like this: