యోని వాపుకు కారణాలు, ఆయుర్వేద చికిత్సలు

మహిళలు బయటకు చెప్పుకోలేని అతిపెద్ద సమస్యలలో ఈ సమస్య ఒకటి. తమ జననాంగాల ఇబ్బందుల గురించి డాక్టర్స్ తో చెప్పుకోవడానికి సైతం సిగ్గుతో సమస్యను పెద్దచేసుకునేవారే ఎక్కువగా ఉన్నారు. అసలు యోని వాపుకు కారణాలేంటి? ఆయుర్వేద చికిత్సలతో ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో తెలుసుకోండి.

అలర్జీలు

స్నానానికి ఉపయోగించే వివిధ రకాల సబ్బులు వాడినప్పుడు వాటిలో ఉండే రసాయనాల కారణంగా యోని చుట్టూ దురద కలిగి యోని వాపుకు కారణమవుతుంది. ఇది సాధారణమే అని కొట్టివేయకుండా ఇబ్బందిగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

అవాంఛిత రోమాలు

ప్రతి ఒక్కరికీ బాహుమూలలో అవాంఛిత రోమాలు రావడం సహజమే. అయితే ఎప్పటికప్పుడు వాటిని తీసివేస్తూ ఉండాలి. ఇలా తీసివేయనప్పుడు యోని లోపలి గోడలకు గుచ్చుకుని మంట, దురద కలగడం వెంటనే యోని వాపుకు కారణమవుతుంది.

శృంగారంలో పాల్గొనప్పుడు

కొందరు శృంగార కోరికలు కలిగిన వెంటనే బలవంతంగా రతిలో పాల్గొన్నప్పుడు యోని భాగంలో బ్లీడింగ్ అయ్యి యోని వాయడం జరుగుతుంది. అందుకే శృంగారంలో మొరటుగా కాకుండా యోనికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి.

బాక్టీరియా & లో దుస్తులు

యోని భాగం సరిగ్గా శుభ్రం చేసుకోనప్పుడు, యోని చుట్టూ చేరుకున్న సూక్ష్మక్రిములు కూడా ఇందుకు కారణం. అలాగే బిగుతైన లో దుస్తులు, గాలి తగలకుండా చేసే జీన్స్ ధరించడం కూడా ఇందుకు కారణం కాబట్టి వీలైనంత వరకు వదులుగా ఉండే లో దుస్తులు, కాటన్ దుస్తులు ధరించడం మంచిది.

యోని వాపుకు తీసుకోవాల్సిన ఆయుర్వేద చికిత్సలు
టీ ట్రీ ఆయిల్ & కొబ్బరినూనె

ఈ రెండిటినీ ఒక స్పూన్ మోతాదులో తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని యోని చుట్టూ రాసుకుని ఒక అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. రోజుకి రెండు మూడు సార్లు ఇలా చేయడం వలన దురద, మంట, వాపు దూరమవుతాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక టేబుల్ స్పూన్ తీసుకుని అందులో కొద్దిగా నీరు కలుపుకోవాలి. దీనిని మీరు ఉపయోగించే టాంపూన్ పై గానీ యోని చుట్టూ రాసుకుని అరగంట లేదా గంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే బాగా పనిచేస్తుంది.

పెరుగు

ప్యాకెట్ లలో లభించే పెరుగు కాకుండా సహజమైన పెరుగు తీసుకుని యోని చుట్టూ రాసుకుని కొన్ని నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవడం వలన యోని చుట్టూ ఉన్న బాక్టీరియా, ఫంగస్, దురద తగ్గిపోతాయి. అలాగే మహిళలు సహజమైన పెరుగునే ఆహారంగా తీసుకోవడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది.

వెల్లుల్లి

వెల్లుల్లిని ప్రతి రోజూ ఒకటి లేదా రెండు తీసుకోవడం వలన మీ యోని చుట్టూ బాక్టీరియా చేరకుండా సహాయపడగలదు. అంతేకాకుండా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాల వలన శరీర రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా చేస్తుంది.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

 

Leave a Reply

%d bloggers like this: