యోనిలో వచ్చే వ్యాధులు, లక్షణాలు : ఆరోగ్యకరమైన యోని కోసం జాగ్రత్తలు

స్త్రీ జననేంద్రియాలలో యోని ఒక భాగము. సాధారణంగా యోనిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఎటువంటి ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదు. అదే శుభ్రపరచుకోగలదు. అయితే స్త్రీలు చేసుకునే కొన్ని నిర్లక్ష్యాల కారణంగా, బాక్టీరియా వలన కొన్ని వ్యాధులు కలుగుతాయి. యోనిలో వచ్చే వ్యాధులు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం.

యోనిలో వ్యాధులు రావడానికి కారణాలు

ముందే చెప్పుకున్నట్లుగా యోని భాగం తనని తానే శుభ్రంగా ఉంచుకోగలదు. ఐతే ఆరోగ్యమైన యోనిలో కొంతమేరకు బాక్టీరియా ఉంటాయి. ఇవి యోనిలో లాక్టిక్ ఆమ్లం తయారుచేసి యోనిలో వ్యాధులు రాకుండా కాపాడుతుంటాయి. ఎప్పుడైతే లాక్టిక్ ఆమ్లం తయారుచేయలేనప్పుడు వ్యాధులు రావడానికి కారణమవుతుంది.

యోనిలో వచ్చే వ్యాధులు, వాటి లక్షణాలు:
పుండ్లు

యోని గోడలలో రాపిడి జరిగినప్పుడు, రతిక్రీడలో అతిగా పాల్గొన్నప్పుడు యోనిపై ఎక్కువ ఒత్తిడి కలగడం వలన, లో దుస్తుల కారణంగా, అవాంఛిత రోమాల వలన యోని యొక్క మ్యూకస్ పొర దెబ్బతిని పుండ్లుగా ఏర్పడుతుంటాయి. యోని చుట్టూ దురద, మూత్రం సమయంలో మంటగా ఉండటం దీని లక్షణాలు.

వ్రణాలు

ఈ సమస్య వయస్సు పై బడుతున్న స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. యోని గ్రంధుల నుండి ద్రవాల్ని తీసుకువెళ్లే నాళాలు మూసుకుపోవడం వలన యోని వాపుకు కారణమవుతుంది. వాపుతో పాటు యోని చుట్టూ పొక్కులుగా ఏర్పడి మంటపుడుతుంటాయి.

స్రావాలు

కొన్నిసార్లు యోని నుండి రక్తం కారుతూ ఉండటం, యోని చుట్టూ వాపు, దురద, మంటగా ఉన్నప్పుడు తెల్లని చీముతో కూడిన రక్తం వస్తుండటం జరుగుతుంటుంది. కొన్నిసార్లు రక్తస్రావం, చీము వస్తున్నప్పుడు దుర్వాసన ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు అస్సలు ఉండదు. ఇన్ఫెక్షన్స్, బాక్టీరియాలే ఇందుకు కారణం.

యోని ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పీరియడ్స్ తర్వాత ఇన్ఫెక్షన్స్ వస్తుంటే

పీరియడ్స్ వచ్చిన తర్వాత కొంతమంది మహిళలలో యోని భాగంలో ఇన్ఫెక్షన్స్ మొదలై దురద, మంట కలిగిస్తుంటాయి. అటువంటప్పుడు ఎటువంటి క్రీములు, మందులు అప్లై చేయకుండా ఒకసారి డాక్టర్ ను కలిసి సమస్య ఏంటో చెబితే అందుకు తగ్గ పరిష్కారం ఇస్తారు. మీరే చేసుకోవడం వలన సమస్య మరి పెద్దది అయ్యే అవకాశం ఉంది.

రతిక్రీడలో మొరటుగా పాల్గొనటం

రతిక్రీడలో మొరటుగా పాల్గొని యోనిపై ఒత్తిడి కలిగించడం, ఎక్కువసార్లు ఒకే విధంగా సెక్స్ లో పాల్గొనటం వలన యోనికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి.

లో దుస్తులు

లో దుస్తులను మరీ టైట్ గా ఉన్నవి కాకుండా కొద్దిగా వదులుగా ఉండేలా చూసుకోవడం, రాత్రి సమయాలలో తీసివేయడం చేయాలి. అలాగే ఒక్కసారి వేసుకున్నాక మళ్ళీ ఉతకకుండా వేసుకోకూడదు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

అప్పుడే పుట్టిన పిల్లల గురించి ఈ 10 విషయాలు మీకు ఎవరు చెప్పరు : తల్లితండ్రులుగా మీరు తెలుసుకోవాలి

Leave a Reply

%d bloggers like this: