ఈ 5 ఆహారాల ద్వారా మీకు బ్రెస్ట్ కాన్సర్ రావచ్చు…

బ్రెస్ట్ క్యాన్సర్ ప్రపంచం మొత్తం వ్యాపిస్తున్న ఒక భయంకరమైన వ్యాధి. మహిళలలో వచ్చే ఈ క్యాన్సర్, చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడియూ ప్రపంచ వ్యాప్తంగా ఈ క్యాన్సర్ గురించి అవగాహనా కలిగించడానికి అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. మహిళలో ఈ క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని రకాల మందులు, జన్యు లోపాలు, అధిక బరువు, శరీరానికి వ్యాయామం లేకపోవడం ఇవన్నీ కారణాలే. కానీ వీటితో పాటు ఆహార అలవాట్లు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కు కారణమవుతాయి. అందుకే ముందుగా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండడం, మీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

బ్రెస్ట్ క్యాన్సర్ కు కారణమయ్యే ఆ ఆహారాలు ఏంటో తెలుసుకోండి…

1. చక్కర

ఈ మధ్యే జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే ఆహారాలు బ్రెస్ట్ క్యాన్సర్ కు ప్రధానమైన కారణం అని తేలింది. గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే ఆహారాలలో ప్రధానమైనది చక్కర.

అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కర శాతాన్ని పెంచుతుంది. దీని కారణంగా శరీరంలో ఇన్సులిన్, ఈస్ట్రోజెన్ విడుదలవుతాయి. ఇవి రొమ్ము కణాలలో ఉండే ఇన్సులిన్ రెసెప్టార్స్ కు అంటుకుంటాయి. దీని కారణంగా రొమ్ము కణాలు విచ్చిన్నం అవడం మొదలవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ గా మారుతుంది.

అందుకే చక్కర, కార్భోహైడ్రేట్స్ ఉన్న ఆహారాలను తక్కువగా తీసుకోండి

2. గ్రిల్ల్డ్ మాంసం

గ్రిల్స్ మీద రకరకాల మాంసాలను కాల్చి తినడం ఈ మధ్య ట్రెండ్ గా మారింది. కొన్ని టెంపరేచర్ ల దగ్గర మాంసాన్ని కాల్చినప్పుడు, అందులో ఉండే ప్రొటీన్ల్ నుండి హెటిరోసైక్లిక్ అమైన్స్ (heterocyclic amines) విడుదల అవుతాయి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ కారకాలు.

అందుకే చికెన్, మటన్ లాంటి మాంసాలను తినేటప్పుడు, ఎక్కువ వేడి తో ఫ్రై చేసి కాకుండా ఉడికించి తినడం మంచిది.

3. అధిక కొవ్వు మాంసాహారాలు

అధిక కొవ్వు మాంసాహారాలు తీసుకోవడం వలన, శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రోలక్టీన్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి హార్మోన్ల కారణంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ కు కారణమవుతాయి. మీ శరీరానికి కావాల్సిన కొవ్వులను గింజలు, అవకాడో, లాంటి వాటి నుండి పొందవచ్చు. మాంసాహారాలను కొంచెం తగ్గించు కొండి.

4. కృతిమ చక్కరలు

చాలా మంది ఈ మధ్య కాలంలో చక్కరకు బదులుగా, కృతిమ చక్కరలను వాడుతున్నారు. ఇది వలన జరిగే మంచి ఎంత వున్నా, చెడు కూడా అంతే వుంది. ఈ చక్కరలలో ఉండే కెమికల్స్, సాధారణ చక్కర లానే అధిక ఇన్సులిన్ ను విడుదల చేస్తుంది.

చక్కర బదులుగా కృతిమ చక్కర వాడడం కన్నా, చక్కరను తీసుకోవడం తగ్గించడం మంచిది. 

Leave a Reply

%d bloggers like this: