దీపావళి రోజున ఈ 5 పనులు అస్సలు చేయకండి. అరిష్టం కలుగుతుంది

ప్రతి ఒక్కరి జీవితంలో వెలుతురు నింపే గొప్ప పండుగ దీపావళి. పండుగ అంటేనే ఉల్లాసం, ఉత్సాహం, సంతోషం కాబట్టి దీపావళి రోజున ఇక్కడ చెప్పుకునే కొన్ని పనులు చేయడం వలన అరిష్టం కలుగుతుంది. అందుకే ఆ పనులను అస్సలు చేయకూడదు. ఇంతకీ ఆ పనులు ఏంటో తెలుసుకుని తెలియనివారికి చెప్పండి.

ఇష్టం లేకుండా ఉండకండి

దీపావళి అంటే మనలోని చెడును, లోపాలను, తప్పులను, మనలో మనకు నచ్చని విషయాలను దూరం చేసి సంబరాలు జరుపుకునే పండుగ. అందుకని దీపావళి అంటే ఇష్టం లేనట్లుగా ఉండటం, ఇంటిని శుభ్రం ఉంచుకోకుండా, ఇంకా నిద్రలేవకుండా, స్నానం చేయకుండా, కొత్త బట్టలు ధరించకుండా ఉంటే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుందని మన పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఇలా అస్సలు చేయకండి.

గొడవలకు దూరంగా ఉండండి

ప్రతిరోజూ గజిబిజిగా బిజీ జీవితం అందరిలోనూ సంతోషాన్ని ఇచ్చేది పండుగ కాబట్టి ఇంట్లో వారితోనూ, బయటకు ఎక్కడికి వెళ్లినా సరే చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించండి కానీ చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకుని చిరాకుగా ఉండటం వలన ఎప్పటికీ జీవితం అలానే ఉంటుందని అంటారు.

దీపాలు ఆరిపోకుండా చూసుకోండి

దీపావళి రోజు గృహం దీపాల కాంతులతో ప్రకాశవంతంగా ఉండటం వలన మీ ఇంటికి ఎప్పుడు శుభం లాభం కలుగుతుంది. దీపాలు పెట్టాం గాలికి ఆరిపోతే మేమేం చేస్తాం అనే నిర్లక్ష్యం ఉండకూడదు. దీపాలు ఆరిపోతే అశుభమని మనవాళ్ళు అంటుంటారు.

నాన్ వెజ్ కు దూరంగా ఉండండి

ఇంట్లో పండుగ జరుపుకుంటున్నప్పుడు ముఖ్యంగా లక్ష్మీ దేవి పూజ, వినాయక పూజ చేసిన ఇంట్లో ఈ రోజు నాన్ వెజ్ తినడం, మద్యపానం సేవించడం చేయకూడదు. ఇంట్లోనే కాదు బయట కూడా నాన్ వెజ్ ముట్టుకుని ఇంటికి రావడం వలన ఇంట్లో వారు చేసిన పూజ వృధా కావడమే కాకుండా లక్ష్మీ కటాక్షం అస్సలు లభించదు.

అసహ్యించుకోకూడదు

పండుగ అంటే మనం మాత్రమే సంతోషంగా జరుపుకోవడం కాదు. పండుగకు ధనిక, పేద, జాతి, మతం అనే ఉండదు కాబట్టి ఈ పండుగ లేనివారికి సహాయం చేయడం మంచిదే. ఎవరైనా మిమ్మల్ని సాయం కోరితే అసహ్యించుకోవడం, దూరంగా వెళ్లడం చేయకండి. మన దగ్గర ఉన్నది ఇతరులకు పంచితే కలిగే ఆనందమే వేరు.

ఈ 5 విషయాలను ఈ దీపావళి రోజున ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అలాగే ఎక్కడికి వెళ్లకుండా కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి. 

దీపావళి లక్ష్మీ పూజ ఎలా చేస్తే మీ కుటుంబానికి శుభం,లాభం కలుగుతాయో తెలుసుకోండి. 

Leave a Reply

%d bloggers like this: