దీపావళి లక్ష్మీ పూజ ఎలా చేస్తే మీ కుటుంబానికి శుభం,లాభం కలుగుతాయో తెలుసుకోండి

దీపావళి అంటే భూమిని దీపాలతో నింపే గొప్ప పండుగ, ప్రతి గృహం దీపాలతో వెలిగే పండుగ దీపావళి. దీపావళిలో లక్ష్మీ పూజ ముఖ్యమైనది. లక్ష్మీదేవి భృగు మహర్షి కూతురు, ఆమె సాగర మదనంలో పునర్జన్మ ఎత్తగా లక్ష్మీ దేవి అందాన్ని చూసి దేవుళ్ళు ముగ్దులయ్యారు. శివుడు లక్ష్మీ దేవిని తన భార్యగా భావించగా, అప్పటికే తనలో చంద్రుడు ఉండటంతో మహావిష్ణువును వివాహం చేసుకున్నట్లు మన పురాణాలు చెబుతున్నాయి. మరి ఈ దీపావళి రోజున లక్ష్మీపూజ మీ భర్తతో కలిసి ఎలా చేయాలో తెలుసుకోండి.

లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి?

దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ ఎందుకు చేయాలంటే లక్ష్మీ దేవిని విజయానికి, సంపదకు మరియు శ్రేయస్సుకు చిహ్నంగా భక్తులు పూజిస్తారు. లక్ష్మీ పూజ చేయడం వలన ఇంటికి శుభం కలిగి సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అయితే ఈ పూజను ఎలా చేయాలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి ఎలాగో తెలుసుకుందాం..

లక్ష్మీ పూజ ముహూర్తం ఎప్పుడు మొదలవుతుంది?

నరకాసుర వధ వలనే దీపావళి జరువుకుంటారు అంటుంటారు, అలాగే రామాయణంలో రాముడుని అయోధ్యకు ఆహ్వానించే సమయంలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవడం జరిగింది. పండుగ అంటే ఉదయమే తలంటు స్నానం చేసుకుని కొత్త బట్టలు ధరించాల్సిన అవసరమేమీ లేదు. సాయంత్రం కూడా జరుపుకోవచ్చు.

అమావాస్య తిథి మొదలయ్యే సమయం – 11.52 ఉదయం నిముషాలకు 19 అక్టోబర్ 2017

అమావాస్య తిథి ముగిసే సమయం -10.59 ఉదయం నిముషాలకు 20 అక్టోబర్ 2017

లక్ష్మీ పూజ ముహూర్తం సాయంత్రం 7.10 నుండి 8.14 నిముషాల వరకు (19 అక్టోబర్)

లక్ష్మీపూజను ఎలా మొదలు పెట్టాలి?
ఇంటిని శుభ్రం చేసుకోండి

ఇది ప్రత్యేకంగా చెప్పకపోయినా లక్ష్మీ పూజను మొదలు పెట్టే ముందు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడపడితే అక్కడ వస్తువులు ఉంచకుండా అందంగా అలంకరించుకోవాలి.

కలశం లక్ష్మీదేవి విగ్రహం ఎలా ఏర్పాటు చేయాలి?

లక్ష్మీ పూజను చేస్తున్న గదిలో లేదా దేవుడి గదిలో ఎర్రటి వస్త్రాన్ని ఉంచి ఆ వస్త్రంపై ధాన్యం పోయాలి. ఆ తర్వాత బంగారం, వెండి, రాగి..ఇలా ఏదైనా ఒక కలశాన్ని ఉంచి అందులో మూడు వంతుల భాగం నీటిని నింపాలి. ఆ కలశంలో 5 లేదా 7 మామిడి ఆకులను ఉంచుకోవాలి. ధాన్యం పోసిన ఎర్రటి వస్త్రంపై ఒక తామర పువ్వును ఉంచాలి. కలశానికి కుంకుమ పసుపు బొట్లు పెట్టాలి.ఆ తర్వాత పసుపు తీసుకుని తామర ఆకారంలో ధాన్యంపై ముగ్గులా వేసి లక్ష్మీ దేవి విగ్రహాన్ని అక్కడ ఉంచాలి.

వినాయకుడి విగ్రహం ఎక్కడ ఉంచాలి?

విఘ్నాలను తొలగించే వినాయకుడి విగ్రహాన్ని కలశంకు కుడివైపున, నైరుతి దిశలో ఉంచాలి. మీ పుస్తకాలు, వ్యాపారానికి సంబంధించిన పైల్స్ ఇక్కడ ఉంచవచ్చు. వినాయకుడి విగ్రహానికి పూజ చేసేముందు దీపం వెలిగించుకోవాలి.

హారతి పళ్లెం

హారతి పళ్లెం తీసుకుని అందులో కుంకుమ, పసుపు, గంధం, తామర పువ్వులు మరియు బియ్యం లేదా ధాన్యం ఉంచి పూజను మొదలు పెట్టాలి. అలాగే వినాయక, లక్ష్మీ దేవి విగ్రహాల ముందు పండ్లు ఉంచుకోవచ్చు.

అక్షింతలు

పూజ మొదలు పెట్టాక లక్ష్మీదేవి మంత్రాలను పఠిస్తూ హారతి పళ్లెంలో ఉన్న అక్షింతలు తీసుకుని లక్ష్మీ దేవి విగ్రహంపై వేస్తూ భక్తి శ్రద్ధలతో పూజించాలి.

హారతి

లక్ష్మీదేవి పూజలో చివరిగా చేయాల్సినది. అంతకుముందు అమ్మవారి విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకం చేసి, ఆ తర్వాత నీటితో శుభ్రం చేసి నూతన వస్త్రంతో శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత అమ్మవారిని మళ్ళీ పసుపు, కుంకుమ, పూలతో అలంకరణ చేసి హారతి పళ్లెం తీసుకుని అందులో కర్పూరం వేసి గంట మోగిస్తూ హారతి ఇచ్చి మనసులోని కోరికలను చెప్పుకోవాలి.

ఇలా లక్ష్మీ పూజను ఇంట్లో వారే కాకుండా బంధువులు మరియు సహచరులతో జరుపుకోవచ్చు. ఈ పూజలో మీ భర్త కూడా భాగం అవ్వడం వలన అందరికీ అంతా శుభమే జరుగుతుంది.

మీకు, మీ కుటుంబానికి మా తరపున దీపావళి శుభాకాంక్షలు. 

 

Leave a Reply

%d bloggers like this: