ఈ ఏడాది కూడా వెలుగులను మోసుకుంటూ దీపాల పండగ దీపావళి వచ్చేసింది. ప్రతి ఇంట్లో బోలెడన్ని సంబరాలు. కానీ వీటన్నిటిలో పిల్లలకు మాత్రం దీపావళి అంటే టపాసులు కాల్చడం. కానీ సరదా ప్రమాదాన్ని కూడా తీసుకు రావచ్చు. అందుకే ఆ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి…
1. టపాసులను ఎక్కడంటే అక్కడ పెట్టద్దు
మూత ఉన్న డబ్బాల్లో, చల్లని ప్రదేశాల్లో, వేడి లోన చోట మాత్రమే మీ దీపావళి టపాకాయలు ఉంచండి. మెట్ల కింద, కరెంట్ ఉన్న చోట వాటిని పెట్టదు.
2. పెంపుడు జంతువులు
మీ ఇంట్లో వుండే పెంపుడు జంతువులకు శబ్దాలంటే చాలా భయం. అందుకే మీరు పిల్లలతో కలిసి టపాసులు పేలుస్తున్నప్పుడు. వాటిని సురిక్షితమైన ప్రదేశంలో ఉంచండి.
3. నీళ్ళు
పిల్లలతో కలిసి టపాసులు పేలుస్తున్నప్పుడు, ఆ టపాసులు ద్వారా మానతలు వ్యాపించచ్చు. అప్పటికప్పుడు కాకుండా ముందే నీరు ముందు జాగ్రత్తగా ఉంచుకోండి.
4. బట్టలు
టపాసులు కాల్చే సమయంలో వదులైన బట్టలు వేసుకోవద్దు. వాటికి నిప్పు సులభంగా అంటుకుంటుంది. అలాగే కాటన్ బట్టలు కూడా వద్దు.
5. చూస్తూ ఉండండి
పిల్లలు టపాసులు కాల్చే సమయంలో వారి పాటికి వారిని వదిలేయకండి. ఆ సమయంలో ఏయ్ పని పెట్టుకోకుండా పిల్లలతో ఉండడానికి ప్రయత్నించండి.
HAPPY AND SAFE DEEPAWALI