మీ బిడ్డకమాట్లాడడం రాకముందు వారితో ఎలా మాట్లాడాలి?

పిల్లలు పుట్టిన మరుక్షణం నుండే మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. అది ఏడవడం కావచ్చు, నవ్వడం కావచ్చు లేదా ఇతర సంకేతాల ద్వారా మనతో కమ్యునికేట్ అవడానికి ప్రయత్నిస్తారు. వారు ఏడుస్తారు ఎప్పుడంటే ఎక్కువ ఆకలి అయినప్పుడు, దాహం అయినప్పుడు, మిమ్మల్ని హగ్ చేసుకోవాలనుకున్నప్పుడు. అయితే మీరు బేబిని గ్రో చేసేటప్పుడు కొన్ని సంకేతాల ద్వారా వారికి ఏమి కావాలో తెలుసుకోవచ్చు.

అవేంటంటే,

1. వారు ఆవులించడం, కళ్ళు నులుపుకోవడం వంటివి చేస్తుంటే….. వారికి నిద్ర వస్తోందని అర్థం.

2. ఎక్కువగా నోరు తెరుస్తూ ఉంటే…. వారికి ఆకలిగా ఉందని అర్థం.

3. కళ్ళు పెద్దవిగా చేస్తే…. వారు ఆడుకోవడానికి సిద్ధం అయినట్ళు.

4. తల అటుఇటూ అడ్డంగా ఊపితే….. వద్దని అర్థం.

బేబీ కోసం తల్లిగా మీరు చేయాల్సిన పనులు

పేరెంటింగ్

బేబీ ఎక్కువగా మీ కళ్ళను, నోటి నుండి వచ్చే మాటల మీద దృష్టి నిలుపుతారు. కాబట్టి, మీరు వాటితో ఎక్కువగా కమ్యునికేషన్ చేయండి.

మీరు చేసేదాని గురించి మాట్లాడండి

మీరు ఏదైనా పని చేసేటప్పుడు దాని గురించి చెప్తూ ఉండండి. దీని ద్వారా మీబిడ్డ కూడా ఏదో ఒకటి మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. దీని ద్వారా వారికి తొందరగా మాటలు వస్తాయి.

పాట పాడండి

మీరు పిల్లల కోసం పాటలు లేదా పద్యాలు పాడండి. మీబిడ్డ మిమ్మల్ని అనుకరిస్తూ పాడటానికి ప్రయత్నం చేస్తారు.

కథలు చెప్పండి

మీ పిల్లలకు చిన్నప్పటి నుండే కథలు చెప్పడం అలవాటు చేయండి చేయండి. దీని వల్ల వారికి వినికిడి నైపుణ్యం పెరగడమే కాకుండా ఊహాశక్తి పెరుగుతుంది.

వారి మాటలు వినండి

మీబేబీ మాట్లాడటం మొదలుపెట్టేటప్పుడు వారి మాటలు వినండి. మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారికి హెల్ప్ చేస్తుంటే తొందరగా మాట్లాడే అవకాశం ఉంటుంది.

వస్తువులు పేర్లు చెప్పండి

మీ చుట్టు ఉన్న వస్తువుల పేర్లను మాటల ద్వారానూ, సంకేతాల ద్వారానూ వస్తువుల పేర్లు చెప్పండి. దీని ద్వారా వారికి గ్రహించే శక్తి పెరుగుతుంది.

ఇవేకాక, మీకు తెలిసిన అన్ని మార్గాల ద్వారానూ మీబేబీతో మాట్లాడటానికి ప్రయత్నించండి. దీని ద్వారా మీ బిడ్డకు తొందరగా మాటలు రావడమే కాకుండా మీకూ, మీబిడ్డకు మధ్య మంచి బంధం ఏర్పడుతుంది.

Leave a Reply

%d bloggers like this: