పిల్లల ఆకలిని ఎలా గుర్తించాలి? పిల్లల నిద్ర గురించి ప్రతి తల్లి తెలుసుకోవాల్సిన 3 విషయాలు

మీరు బిడ్డకు జన్మనిచ్చిన క్షణం నుండి వారి బాగోగులే మీ మొదటి ప్రాధాన్యత అవ్వాలి. వారి ప్రతి కదలికను మీరు గమనించాలి మరియు అర్థం చెసుకోవాలి. అప్పుడే పుట్టిన పిల్లలకు సంబంధించి ఎంతసేపు నిద్రపోవాలో అన్న విషయం మీద తల్లికి స్పష్టమైన అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు వారి నిద్ర, ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం.

వారి నిద్రావలయం

సాధారణంగా చిన్న పిల్లలు రోజుకు 15 గంటల పాటూ నిద్రపోతారు. అయితే ఇది అందరిలోనూ ఒకేరకంగా ఉంటుందని చెప్పలేము. కొందరు వరుసగా ఎక్కువ గంటలు నిద్రపోతారు మరి కొందరు అప్పుడప్పుడు ఎక్కువగా నిద్రపోతారు. చిన్నపిల్లలు వారి నిద్రలో దాదాపు 80 శాతం ఆర్ఈయం నిద్రపోతారు. ఎదిగిన వారిలో ఇది కేవలం 20 శాతం ఉంటుంది. ఇలా నిద్రపోయేటప్పుడు వారు కలలు కంటుంటారు. అదే సమయంలో వారి మెదడు చురుకుగా పని చేస్తుంది. చిన్నపిల్లలలో పైపైన నిద్ర, లోపలి నిద్ర అని రెండు రకాలు ఉంటాయి. ఇది 50;70 నిష్పత్తిలో ఉంటాయి. వీరు 50 నిముషాలు బాగా నిద్రపోతే, 70 నిముషాలు కొంచెం మెలుకువతోనే నిద్రపోతారు. మీరు వారిని నిద్ర లేపాలనుకుంటే అది మంచి సమయం.

బేబీని ఎందుకు నిద్ర లేపాలి

సాధారణంగా మీరు పాపను ఎందుకు నిద్ర లేపాలంటే, వారికి పాలు ఇవ్వడం కోసం. వారు తీసుకొనే అహారం రాత్రి మొత్తానికి సరిపోదు కాబట్టి వారిని లేపి మరీ పొట్టను నింపాలి. ఇంకో కారణం ఏంటంటే, వారికి పగలేదో, రాత్రేదో నేర్పడానికి కూడా వారిని నిద్రలో నుండి మేల్కొల్పాలి. వారికి 6నెలల వయసు వచ్చేసరికి రాత్రిపూట మాత్రమే నిద్రపోవాలి అన్న విషయం అర్థం అవ్వాలి.

ఎంత పరిమాణంలో పిల్లలకు పాలు పట్టించాలి

పిల్లలకు ఎన్ని పాలు పాలు పట్టించాలన్న విషయం మీద చాలా అంది తల్లులకు అవగాహన ఉండదు. ఒక తల్లిగా మీరు మీ బిడ్డ కదలికలను, ఆహారం కోసం వారిచ్చే సంకేతాలను గమనించాలి. అధ్యయనాల ప్రకారం ఒక కేజీ బరువు ఉన్న బేబీకి 150-200 మిల్లీలీటర్ల పాలు అవస్సరం అవుతాయి.

– మొదటి 2-4 వారాల సమయంలో ఒక్కసారి పాలు పట్టించినప్పుడు వారు 60-70 మిల్లీలీటర్ల పాలు తాగుతారు.

– 2-8 వారల మధ్యలో ఒకసారి పాలు తాగిస్తే 75–100 మిల్లీలీటర్ల పాలు తాగుతారు.

– 2-6 నెలల మధ్య పిల్లలు 100-200 మిల్లీలీటర్ల పాలు తాగుతారు.

అయితే ఈ లెక్కలు ప్రతి బేబీలోనూ కరెక్టని చెప్పలేము. కొందరికి కొంత తేడాతో ఎక్కువ-తక్కువలు ఉంటాయి.

పాలు తాగించడానికి లేపవచ్చా!!

మీరు మీబిడ్డకు పాలు ఇవ్వడానికి నిస్సంకోచంగా లేపవచ్చు. వారు సంపూర్తిగా తాగి నిద్రపోతే వారి ఆరోగ్యానికి ఎంతో మేలు. మొదటి 2-3 వారాల మధ్యలో ప్రతి 2-3 గంటలకు ఒకసారి వారిని లేపి పాలు పట్టించండి. రాత్రిపూట మాత్రం 4 లేదా 5 గంటలకు ఒకసారి లేపండి. వారి వయసును, ఆకలి బట్టి సమయం మారుతూ ఉండవచ్చు. కాబట్టి ఆవిధంగా ప్లాన్ చేసుకోండి.

Leave a Reply

%d bloggers like this: