బాదం మిల్క్ పౌడర్ ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి?

అలసిపోయిన పిల్లలకు తక్షణ శక్తిని కలిగించే గుణం బాదం మిల్క్ లో ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఈ ఆహారం అంటే చాలా ఇష్టపడతారు. ఐతే బాదం మిల్క్ పౌడర్ మార్కెట్ లో లభిస్తున్నప్పటికీ అవి ఎలా ఉంటాయో అని భయపడుతూ ఉంటారు. అందుకని ఇంటి వద్దే సింపుల్ గా ఎలా తయారుచేసుకోవచ్చో తెలుసుకోండి.

బాదం మిల్క్ పౌడర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు :

బాదం – 150 గ్రాములు

జీడిపప్పు – 100 గ్రాములు

పిస్తా – 100 గ్రాములు

వాల్ నట్స్ – 50 గ్రాములు

పసుపు – 1 టేబుల్ స్పూన్

ఏలకుల పొడి – 2 టేబుల్ స్పూన్లు

కుంకుమ పువ్వు (పొరలు) – 1 టేబుల్ స్పూన్

పంచదార – 100 గ్రాములు

ఎలా తయారు చేసుకోవాలి?

Step-1

ముందుగా బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్ నట్స్ లను బౌల్ లో వేసుకుని కొన్ని నిముషాల పాటు వేయించాలి. వేయించిన తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టాలి.

Step-2

మిక్సీలో చక్కెర, పసుపు, ఏలకుల పొడి, కుంకుమ పువ్వులను పైన చెప్పిన మోతాదులో వేసి బాగా పొడిగా అయ్యేవరకు మిక్సీ పట్టుకోవాలి.

step -3

చల్లార్చిన బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్ లను, మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమంలో వేసి ఈ రెండు పదార్థాలు బాగా మెత్తని పొడిగా అయ్యేవరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడితో బాదం మిల్క్ పౌడర్ రెడీ అయినట్లు. దీనిని ఒక బాక్స్ నిల్వఉంచుకోవచ్చు. 3-4 వారాల వరకు పాడవ్వదు.

పిల్లలకు ఎలా ఇవ్వాలి?

రెండు టేబుల్ స్పూన్ల బాదం మిల్క్ పౌడర్ ను ఒక గ్లాస్ వేడి లేదా చల్లని పాలలో కలిపి ఇవ్వడం వలన పిల్లలు ఇష్టంగా తాగుతారు. వారి ఆరోగ్యానికి మంచిది కూడా. పెద్దలు కూడా తాగవచ్చు.

ఈ అద్భుతమైన రెమెడీని అందరికీ తెలిసేలా SHARE చేయండి. 

ఇవి కూడా చదవండి. 

చేతులు లేని ఈ బాలుడు చెల్లెలు ఏడుపు ఆపడానికి చేసిన ప్రయత్నం కన్నీళ్లు పెట్టిస్తుంది

Leave a Reply

%d bloggers like this: