రహస్య భాగాలలో నలుపు సహజంగా తొలిగించడానికి 5 సులువైన చిట్కాలు

శరీర రహస్య భాగాలు చాలా వరకు నలుపుగా ఉంటాయి. కొన్ని భాగాలు నలుపుగా ఉండడం సమస్య కాదు కానీ ఆర్మ్ పిట్స్ నల్లగా ఉండడం వలన స్లీవ్ లెస్ వేసుకోలేరు. ఇలాంటి ప్రైవేట్ భాగాలలో నలుపు పోగొట్టడం, అంత సులువు కాదు. కానీ ఈ చిట్కాలతో సులువుగా, పిరుదులు, యోని ప్రాంతం, మోకాళ్ళు, మోచేతులు లాంటి భాగాలలో నలుపును తొలిగించవచ్చు.

1. అలోవెరా జెల్

అలోవెరా చాలా సులభంగా దొరుకుతుంది. అందులోని గుజ్జును నల్లగా ఉన్న శరీర భాగాలపై రాయండి. జెల్ చర్మంలోకి వెళ్ళేలాగా మర్దన చేయండి. తరువాత 20 నిముషాల పాటు అలానే ఉంచండి. అలోవెరా పిగ్’మెంటేషన్ ను తొలిగించి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

2. సొయా మిల్క్

సొయా మిల్క్ లో బేకింగ్ పొడి కలిపి చిక్కని మిశ్రమంగా తయారుచేసుకోండి. ఆ మిశ్రమాన్ని నలుపు ప్రదేశాలలో రుదండి. 5 నిమిషాల తరువాత చల్ల నీటితో కడుక్కోండి. సొయా మిల్క్ లో ఉండే ప్రోటీన్లు పిగ్’మెంటేషన్ తొలిగించడానికి ఉపయోగపడుతాయి.

3. బొప్పాయి

బొప్పాయి గుజ్జులో నిమ్మరసం పిండి, ఆ మిశ్రమాన్ని నల్లగా ఉండే ప్రాంతాలలో పూసి, 15 నిముషాల పాటు ఉంచండి. తరువాత చల్లని నీటితో కడిగేసుకోండి. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ చర్మం లోని మృత కణాలను తొలిగిస్తుంది. నలుపును పూర్తిగా పోగొడుతుంది. 

Leave a Reply

%d bloggers like this: