కార్తీక సోమవారం మీ భర్తతో కలిసి ఈ 5 పనులు చేయండి. పాపాలు తొలగిపోతాయి

ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత మరుసటి రోజు నుండి పవిత్రమైన కార్తీకమాసం ఆరంభమవుతుంది. పరమ శివుడికి కార్తీక మాసం అంటే ఎంతో ఇష్టం. ఈ కార్తీకమాసం అంతా భక్తులు శివ ఆలయాలు సందర్శించుకుని శివుడి పూజలతో అంతా భోళాశంకరుడి నామాన్ని స్మరిస్తూ ఉన్నారు. అందుకే ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసంగా పిలుస్తారు. మరి ఈ కార్తీక మాసంలో చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఏంటో తెలుసుకోండి.

దీపారాధన

కార్తీక మాసంలో ప్రతి గృహిణీ చేయాల్సిన పని దీపారాధన. సూర్యోదయానికి ముందే నిద్రలేచి , తలస్నానం చేసి మంచి బట్టలు ధరించి నువ్వులనూనెతో దేవుడి గదిలో ఇంటి ముందు దీపాలను వెలిగించాలి. అలాగే సాయంత్రం కూడా ఈ విధంగా చేయాలి. కార్తీక మాసం మొత్తం ఇలా దీపారాధన చేయడం వలన గత జన్మలో చేసిన పాపాలు, ఈ జన్మలోని పాపాలు తొలగిపోతాయని చెబుతారు.

నెల అంతా అవసరం లేదు

కార్తీక మాసం మొదలైన తర్వాత చాలామంది నియమ నిష్టలు పాటించకుండా ఉండలేని వారు ఈ విధంగా చేస్తే సరిపోతుంది. నెల అంతా పాటించలేని సోమవారం, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ రోజులలో గానీ ప్రతి సోమవారం లేదా పౌర్ణిమ రోజున గుడి లేదా నదీస్నానం ఆచరించి భక్తి శ్రద్దలతో దీపారాధన చేసి నియమ నిష్టలతో ఉపవాసం ఉండటం వలన భక్తులకు కలిగే పుణ్యం మాటల్లో కూడా చెప్పలేమని సాక్షాత్తు ఆ బ్రహ్మయే చెప్పాడు.

కార్తీక మాసంలో దీపం దానం చేస్తే..!

శివుడికి ప్రీతిప్రాతమైన కార్తీకమాసంలో మహిళలు దీపం దానం చేయడం వలన వారికి కీర్తి సౌభాగ్యాలు కలగడమే కాకుండా మనిషిలోని అజ్ఞానమనే చీకటిని దూరం చేసి జ్ఞానమనే వెలుతురుని అందిస్తాయి.

ఇవి అస్సలు ముట్టరాదు

ముక్కంటి అయిన శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో మాంసం, మసాలా పదార్థాలు, మద్యం సేవించడం, ఉల్లి,వెల్లుల్లికి దూరంగా ఉండటం చేయాలి. మీరు ఎంత భక్తి శ్రద్ధలతో కార్తీకమాసం పూజలు చేసినా ఇవి ముట్టుకోవడం వలన పూజాఫలం వృధా అవుతుంది.

నువ్వుల నూనెనే ఎందుకు ఉపయోగించాలి?

ప్రతి గృహిణీకి మనస్సులో ఈ ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. ఎవర్ని అడిగినా సరైన సమాధానం మాత్రం దొరికి ఉండదు. కార్తీకమాసంలో దీపారాధనకు నువ్వుల నూనెను ఎందుకు ఉపయోగిస్తారంటే దీపం వత్తి నుండి వచ్చే పొగ మానవ హృదయనాడీ స్పందనను బలిష్ఠపారించి హృదయ స్పందనను అదుపులో ఉంచుతుంది. అలాగే నువ్వులనూనెను దీపారాధనకు మాత్రమే ఉపయోగించాలి. మరే ఇతర పనులకు వాడకూడదు.

భర్తతో కలిసి కార్తీకమాసం జరువుకోవచ్చా?

కార్తీకమాసం మహిళలు మాత్రమే చేసుకోవాలా? పెళ్లి అయిన మగవారు చేయకూడదా అని అడుగుతూ ఉంటారు. దైవానికి లింగభేదం అని ఉండదు. భక్తి శ్రద్ధలతో చేసే ఏ పనికైనా తన కృప ఎప్పటికీ ఉంటుంది. అందుకని ఈ మాసం మీ ఆయనతో మీరు జరుపుకోవచ్చు. వీలైనంత వరకు ఏదైనా సోమవారం నదీ స్నానం లేదా గుడి వద్ద స్నానం ఆచరించి ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందండి. మీకు మీ ఇంటిల్లిపాదికీ ఆరోగ్యకరం.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే అందరికీ SHARE చేయగలరు.

ఇవి కూడా చదవండి. 

భారతీయ వివాహ సాంప్రదాయాల వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు

Leave a Reply

%d bloggers like this: