తను అప్పుడే పుట్టిన శిశువు కాదు…. అరుదైన మరుగుజ్జుతనంతో పుట్టిన అపూరూపమైన 7 నెలల బాలుడు

తను అప్పుడే పుట్టిన శిశువు కాదు…. అరుదైన మరుగుజ్జుతనంతో పుట్టిన అపూరూపమైన 7 నెలల బాలుడు

మీరు ఫొటోలో చూస్తున్న బాబు చూడడానికి అప్పుడే పుట్టిన పసి బిడ్డలా కనిపిస్తున్నాడు కదూ. కానీ కాదు. ఆ బాబు వయసు 7 నెలలు . సాధారణంగా 7 నెలల పిల్లలు ఎంత బరువుంటారు? సుమారు 7 కేజీలు. అది సహజం. కానీ ఈ బాబు బరువు కేవలం 1.36 కేజీలు (3 పౌండ్స్) మాత్రమే.

అందుకు కారణం, ఈ బాబు ఒక విచిత్రమైన అరుదైన మరుగుజ్జుతనంతో పుట్టడమే. ఈ బాబు పేరు మాథ్యూ. 28 వారాలకు అమ్మ కడుపు నుండి బయటకు వచ్చాడు. తను పుట్టినప్పుడు కేవలం 0.45 కేజీ (1 పౌండ్) మాత్రమే ఉన్నాడు. మొదట డాక్టర్లు మాథ్యూ మెదడు వ్యాధితో పుట్టాడని ఎక్కువ రోజులు బతకడని తేల్చేసారు. 98 రోజుల పాటు NICU లో ఉన్నాక, ఆరోగ్యం మెరుగుపడింది. కానీ తనకు అరుదైన మరుగుజ్జుతనం, ‘PRIMORDIAL DWARFISM’ ఉందని తేల్చారు. మాథ్యూ అందరి పిల్లల లాగే మాట్లాడగలడు, నడవగలడు కానీ పొట్టిగా ఉంటాడు.

ఇదంతా మాథ్యూ దృరదృష్టం అనుకుంటే పొరపాటే, తన ఈ అంగవైకల్యాన్ని, తన కుటుంబ సభ్యులు ప్రత్యేకతగా భావిస్తున్నారు. తన రూపం, పొడవు తో సంబంధం లేకుండా అందరూ తనను ప్రేమతో ముంచెత్తుతున్నారు, తన ఇద్దరు అన్నలకు మాథ్యూ అంటే చాలా ముద్దు. అయితే మాథ్యూ కు ఇంకొన్ని రోజులలో మెదడు సర్జరీ జరగబోతుంది. తనను అమితంగా ప్రేమించే తన కుటుంబ సభ్యుల తోడ్పాటుతో దానిని ఎదురుకోబోతున్నాడు. మనం కూడా మన ప్రేమను, దీవెనలను అందిద్దామ్!!!

ఈ వీడియోలో మాథ్యూ ను చూడండి…

అందరికి SHARE చేయండి

Leave a Reply

%d bloggers like this: