బయటి ప్రపంచం చాలా చాలా చెడ్డది. మంచి వారికి ఆప్రపంచం మరింత చెడ్డది. మీ పిల్లలు బయటి ప్రపంచాన్ని ఫేస్ చేసేముందు కొన్ని పాఠాలు నేర్చుకోవడం చాలా ఉత్తమం. దీని వల్ల ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో వారికి తెలుస్తుంది. అవేంటంటే,
అపజయాన్ని ఫేస్ చేయాలి
ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి ఓటమిని ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీ పిల్లలు ఎక్కడైనా, ఎప్పుడైనా ఓడిపోతే ఆ అపజయాన్ని ఎదుర్కొనేలా వారిని సన్నద్ధం చేయండి. ఏ ఆటలోనైనా ఒక్కరే గెలుస్తారనే నిజాన్ని వారికితెలియజేయండి.
మంచి నడవడిక
మీ పిల్లలకు మంచి పద్ధతులను, నడవడికలను నేర్పండి. మీ పిల్లల నుండి ఇతర పిల్లలను వేరు చేసే ఏకైక ప్రాతిపదిక నడవడిక మాత్రమే. మంచి నడవడిక ద్వారా వారు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.
వస్తువుల కన్నా మనుషులకే ప్రాముఖ్యం
వస్తువుల కన్నా మనుషులకే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేలా మీపిల్లలకు అలవాటు చేయండి. దీని వల్ల ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో మీ పిల్లలకు తెలుస్తుంది.
మంచి స్నేహితులు
మీ పిల్లలు ఎలాంటి వారో వారి స్నేహితులను చూసి చెప్పవచ్చు. కాబట్టి మీ పిల్లలకు స్నేహితులను ఎంపిక చేసుకొనే విషయంలో స్వేచ్చను ఇస్తూనే వారి స్నేహాలని ఒక కంట గమనిస్తూ ఉండండి.
పెద్దలను గౌరవించడం
పెద్దలను గౌరవించడం అనేది పిల్లలకు చిన్నప్పటి నుండే అలవడటం మంచిది. దీని వల్ల వారికి సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది.
గెలుపోటములను సమానంగా
గెలుపోటములను సమానంగా తీసుకోవడాన్ని వారికి చిన్నప్పటి నుండే అలవాటు చేయండి దీని ద్వారా వారు మానసికంగా బలంగా ఉంటారు.
నిజం చెప్పే విధంగా
చాలా సంధర్భాలలో పిల్లలు అపధాలు చెప్పడానికి కారణం పర్యావసనాలకు భయపడే!! కాబట్టి మీ పిల్లలను ఎప్పుడూ నిజం చెప్పేవిధంగా మీరు ప్రొత్సహించండి మరియూ నిజం చెప్తే నేను ఏమీ అనను అని వారికి భరోసా ఇవ్వండి.
ఇతరుల నుండి నేర్చుకోండి
ఇతరుల నుండి మంచి విషయాలను నేర్చుకొనే విధంగా మీ పిల్లలను ప్రొత్సహించండి. వయసులో చిన్న వారి నుండి కూడా మంచి విషయాలు నేర్చుకోమని మీ పిల్లలకు చెప్పండి. దీని ద్వారా మీ పిల్లలో నేర్చుకొనే తత్వం పెరిగి ఏ సమస్యనైనా పరిష్కరించే స్థాయికి ఎదుగుతారు.
మర్యాద-దయ
మీ పిల్లలలో మర్యాదపూర్వకమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించండి. అందరి మట్ల దయతో మెలగాలని, మర్యాదపూర్వకంగా ఉండాలని చెప్పండి. దీని ద్వారా మీ పిల్లలకు అందరితో సత్సంభందాలు ఏర్పడుతాయి.
జీవితం ఒక బహుమతి
జీవితం ఒక బాహుమతి అని మీ పిల్లలకు చెప్పండి. జీవితం ఎంతో విలువైనది అని, వారి జీవితంతో పాటూ పక్కవారి జీవితం కూడా చాలా విలువైనది అని చెప్పండి. జీవితంలో ఏదైనా జరిగినా క్రుంగిపోకుండా నిలబడాలని వారికి చెప్పండి. దీని ద్వారా వారికి జీవితం పట్ల మరింత కృతఘ్నత ఏర్పడుతుంది.
అందరికి SHARE చేయండి…