మీ కుటుంబ ఖర్చును తగ్గించుకోవడానికి 5 మార్గాలు

ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చాలా ప్లానింగ్‌తో కూడుకున్న సున్నితమైన విషయం. పిల్లలు పుట్టిన తర్వాత మీరు తీసుకొనే ప్రతి నిర్ణయం కూడా మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొనేదే కాబట్టి ప్లాన్ చేయాలనుకున్నప్పుడు ఈ కింది విషయాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది.

1.రెండో సంతానం

మీరు మరో బిడ్డకు జన్మను ఇవ్వాలి అనుకుంటే భవిష్యత్తులో మీకు అయ్యే ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి మీరు ఆ ఖర్చును భరించగలరు అనుకుంటే మాత్రమే మరో బిడ్డను కనడానికి పూనుకోండి లేకపోతే నియంత్రణ చేయించుకొండి.

2. ప్రీస్కూల్

ఇప్పటి కాలంలో అందరూ కూడా వారి పిల్లలను ప్రీ-స్కూల్‌లో జాయిన్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా చెయ్యవలసి వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా మీ ఖర్చులను ప్లాన్ చేసుకోండి.

3. అందరూ కలిసి

మీరు రోజులో ఒకటి లేదా 2 సార్లు పిల్లలతో, భర్తతో కలిసి భోజనం చేయండి. దీని వల్ల మీరు మనసు విప్పి మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుంది అంతేకాకుండా మీ పిల్లల అభిరుచులేంటో మీరు స్వయంగా తెలుసుకోవచ్చు. దీని వల్ల మీకు మీపిల్లలకు మధ్య మంచి బంధం ఏర్పడుతుంది.

4.నెల సరుకులు 

నెలకు కావల్సిన సరుకుల లిస్ట్‌ను ఏర్పాటు చేసుకోండి. దీని వల్ల దేనికి ఎంత ఖర్చు అవుతుందో, దేనికి ఎంత ఖర్చు పెట్టాలో తెలుస్తుంది. ఈ అలవాటును ప్రెగ్నెన్సీ అయినప్పటి నుండి అలవాటు చేసుకోండి.

5. భర్తతో ఒక్కటవ్వడం

మీరు బిడ్డకు బిడ్డకు మధ్య గ్యాప్ ఉండాలనుకుంటే ముందే ప్లాన్ చేసుకోండి మీకు ఫెర్టిలిటి రేట్ ఎక్కువగా ఉండే రోజుల్లో ఏకాంతంగా పాల్గొనకపోవడం మంచిది. దీని వల్ల మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే బిడ్డను కనవచ్చు.

6.పిల్లల ఖర్చు

మీ పిల్లల యొక్క ఖర్చు తగ్గించడానికి మీరు ప్రయత్నించండి. దీని కోసం మీరు మీ ఇరుగు  పొరుగు వారిని అడిగి ఏ స్కూల్ అయితే మీ పిల్లలకు మంచిదో, ఎక్కడ చదువు బాగా చెప్తారో తెలుసుకోని జాయిన్ చేయించండి. దీని ద్వారా మీ పిల్లలకు మంచి చదువును మంచి ధరలో అంధించవచ్చు.

7. వయసు తేడా

మీరు మొదటి బిడ్డకు, రెండో బిడ్డకు ఎడం ఉండేలా చూసుకోండి. ఒక బిడ్డను పెంచడం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఫేస్ చేసి ఆ తర్వాత మరో బిడ్డకు జన్మను ఇవ్వడానికి రెడీ అవ్వండి. బిడ్డకు బిడ్డకు మధ్య గ్యాప్ ఉండటం వల్ల మీ ఆరోగ్యానికి కూడా మంచిది.

Leave a Reply

%d bloggers like this: