పిల్లలు పుట్టిన తర్వాత డబ్బు సేవ్ చేయడానికి 5సులువైన మార్గాలు

బిడ్డలు  పుట్టిన తర్వాత ఎన్నో ఖర్చులు ఉంటాయి. వాటికి హద్దూ అదుపు ఉండవు. వారి బవిష్యత్తు కోసం అని, చదువు కోసం అని, హెల్త్ కేర్ కోసం అని ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. వీటన్నింటి కోసం మీరు సేవింగ్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కింది విధానాల ద్వారా మీరు మనీ సేవ్ చేసుకోవచ్చు.

పిల్లలకు కావల్సినవన్నీ పెట్టుకోవాలి

మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ బేబికి కావల్సిన అన్నీ వస్తువులు పెట్టుకోండి. డైపర్స్, దుస్తులు, స్నాక్స్ పెట్టుకోవాలి. ఒకవేల ఏదైనా అవసరం వచ్చినా కొనాల్సిన పని ఉండదు.

ఆహారం తయారు చేసుకోవడం

మీ బేబీకి కావల్సిన ఆహారాన్ని మీరే తయారు చేసుకోండి. మీ పాప బాగ తింటూంటే ఆపిల్ లేదా అరటి వంటీ పళ్ళను తినిపించవచ్చు. ఇప్పుడు వస్తున్న సెరిలాక్ కూడా మరీ అంత ఖర్చుతో కూడుకోలేదని గమనించాలి. మీ పిల్లలు బిస్కెట్స్ తినడం మొదలు పెట్టినట్లైతే మీరు వాటిని కూడా తినిపిస్తూ డబ్బు ఆదా చేసుకోండి.

దుస్తులు ముందే కొనకండి

మీ పిల్లలంటే మీకు బాగా ఇష్టం ఉందవచ్చు. అందుకని ఎక్కువ మొత్తంలో దుస్తులు కొనకండి. ఎందుకంటే వారు బాగా పెరిగే దశలో ఉంటారు. మీరు కొన్న దుస్తులు కేవలం కొన్ని రోజుల్లోనే టైట్ అవడం జరగవచ్చు. దీంతో మీరు ఎక్కువ డబ్బును వృధా చేసినట్లు అవుతుంది.   కాబట్టి, దుస్తులను అప్పుడప్పుడు కొంటూ, తక్కువ మోతాదులో కొనడం మంచిది.

డైపర్స్

మీకు ఒక్కోసారి అనిపించవచ్చు ఏమని అంటే, మీరు మీ బేబీకి దుస్తుల కోసం పెట్టే ఖర్చు కన్నా డైపర్స్ కోసం పెట్టే ఖర్చు ఎక్కువని. కాబట్టి మీరు డైపర్స్‌ను పెద్ద మోతాదులో కొనడం వల్ల మీకు మంచి రేటులో లభించే అవకాశం ఉంది. దీని వల్ల మీరు కొంత డబ్బును ఆదా చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ షాపింగ్

మీకు బేబి సంబంధించి ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం కూడా మంచి ఆలోచన. ఎందుకంటే, కొన్ని సార్లు మీకు ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్ రావచ్చు. ఇప్పుడు చాలా స్టోర్స్ పిల్లల వస్తువులను కూడా వారి సైట్‌లో అందుబాటూలో ఉంచుతున్నాయి. ఇంకో సౌలభ్యకరమైన విషయం ఏమిటంటే, మీరు మీ బేబీని తీసుకొని షాపింగ్ మాల్స్‌కు వెళ్ళాల్సిన పని తప్పుతుంది.

పై మార్గాల ద్వారా మీరు డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ డబ్బును మీరు మీ కుటుంభ అవసరాలకు, పిల్లల చదువు కోసం ఉపయోగించవచ్చు. ఇవే మీకు తెలిసిన అన్ని మార్గాలను కూడా డబ్బు ఆదా చేయడానికి ఉపయోగించండి. 

Leave a Reply

%d bloggers like this: