గర్భధారణ సమయంలో వచ్చే థైరాయిడ్ బిడ్డకు ప్రమాదమా?

గర్భధారణ సమయంలో సాధారణంగా మహిళలు ఎదుర్కునే సమస్యలలో  థైరాయిడ్ ఒకటి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా, ఉండవలసిన హార్మోన్ల కంటే అదనపు హార్మోన్లు ఉండటం వలన ఇందుకు కారణం కావచ్చు. థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి? పుట్టబోయే బిడ్దపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో వివరంగా తెలుసుకుందాం.

థైరాయిడ్ లక్షణాలు

ఆకలిగా లేకపావడం, బరువు తగ్గడం లేదా పెరగడం, జుట్టు రాలుతూ ఉండటం, శరీరం నీరసంగా ఉండటం, నరాలు కీళ్లనొప్పులు, శ్వాసతీసుకోవడంలో మార్పులు, జీర్ణాశయ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం, గొంతు భాగంలో వాపు, నొప్పి, శరీరం ఒక్కోసారి చల్లగా ఉండటం, వేడిగా మారటం థైరాయిడ్ లక్షణాలు. ఇలా ఏవైనా లక్షణాలు మహిళలలో గానీ గర్భిణీలలో గానీ కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చేయాలి.

పుట్టబోయే బిడ్డపై థైరాయిడ్ ప్రభావం
గర్భస్రావం

గర్భధారణ సమయంలో మొదటి మూడు నెలలలో రక్తంలో థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా ఉండటం వలన గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఇటువంటి ఇబ్బందులు లేకుండా ముందే ఈ వ్యాధిని గుర్తించి, అందుకు తగ్గ నివారణ చర్యలు తీసుకుంటున్నారు.

పుట్టబోయే బిడ్డ

గర్భిణీలలో థైరాయిడ్ సమస్యను వెంటనే గుర్తించకపోతే అది పుట్టబోయే పిల్లలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మానసిక వైకల్యంతో పిల్లలు జన్మించడం, బుద్ధిమాన్యత లోపాలు ఉంటాయని చెబుతున్నారు.

ముందుగానే జన్మించడం

గర్భిణీలలో థైరాయిడ్ సమస్య వలన అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. దీని కారణంగా పిండం పెరుగుదలపై ప్రభావం చూపి, బిడ్డ ముందుగానే జన్మించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఇలా నెలలు నిండకుండానే జన్మించడం వలన ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది కూడా.

తక్కువ బరువు కలిగి ఉండటం

గర్భిణీలలో థైరాయిడ్ సమస్య కారణంగా  పిల్లలు ముందుగానే జన్మించడం ఒక ఎత్తైయితే, కొన్నిసార్లు తక్కువ బరువుతో జన్మించడం కూడా జరుగుతుంటుంది. తక్కువ బరువుతో పిల్లలు జన్మించడం వలన అది వారి కిడ్నీలపై మరియు ఎదుగుదలపై ప్రభావాన్ని చూపిస్తుంది.

అందుకని పైన చెప్పుకున్న లక్షణాలు గర్భిణీలలో కనిపించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చేయాలి. లేకపోతే మీకు అనుమానం ఉన్నాకానీ థైరాయిడ్ పరీక్షలు చేయించుకుంటే తెలిసిపోతుంది. అయితే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం తల్లికి, బిడ్డకు మంచిది కాదు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

మీ ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదముంటే పీరియడ్ రక్తం ఆధారంగా తెలుసుకోవచ్చు.

Leave a Reply

%d bloggers like this: