గర్భంతో ఉన్నప్పుడు ముక్కు నుండి రక్తం రావడం ప్రమాదమా?

గర్భంతో ఉన్నప్పుడు చాలామందికి ఎదురయ్యే సమస్యలలో ముక్కు నుండి రక్తస్రావం ఎక్కువగా  జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ప్రమాదమా? అనే అనుమానం అందరిలోనూ ఉంది. గర్భధారణ సమయంలో ఇలా జరగడం సహజమే కానీ ఈ విధంగా జరగడానికి అసలు కారణం ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం..

ముక్కు నుండి రక్తం రావడానికి కారణాలు

ముక్కు పొడిబారినప్పుడు, సైనసైటిస్, ఎక్కువ ఒత్తిడితో ముక్కును చీదినప్పుడు, గర్భంతో ఉన్నప్పుడు రక్తకణాలు విస్తరించి రక్త ప్రసరణ ఎక్కువగా జరుగుతుండటం వలన ముక్కు వంటి సున్నిత కణాలపై ఒత్తిడి పెరిగి పగుళ్లుగా ఏర్పడి రక్తస్రావం జరుగుతుంది. తలకు దెబ్బ తలిగినప్పుడు, శరీర వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, తరచూ జలుబు, నోస్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది.

రక్తస్రావం ప్రమాదమా?

తరచూ ముక్కు నుండి రక్తస్రావం జరుగుతుంటే ప్రమాదమే కానీ అప్పుడప్పుడు రక్తం వస్తూ ఉండటం సహజమే కాబట్టి ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు.

ముక్కు నుండి రక్తం రాకుండా ఏం చేయాలి?

శరీరంలో రక్తప్రసరణ కీలకపాత్ర పోషిస్తుంది కాబట్టి రక్తం ఎప్పుడు బయటకు పోకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇలా ముక్కు నుండి రక్తస్రావం జరుగుతుంటే ఏం చేయాలంటే…

-తలను కిందకు వంచకూడదు, గుండె కంటే ఎక్కువ ఎత్తులో తల ఉండేలా చూసుకోవడం వలన రక్తస్రావం ఆగిపోతుంది.

-అధికంగా రక్తస్రావం జరుగుతుంటే ఐస్ లేదా చల్లని బట్టను ముక్కుపై ఉంచడం వలన రక్తం కారడం తగ్గుతుంది. ఇలా చేయడం వలన ముక్కుకి సంబంధించిన రక్తనాళాలు సంకోచించుకుంటాయి.

-నీరు తక్కువగా తాగడం కూడా రక్తం రావడానికి కారణం కాబట్టి వీలైనంత ఎక్కువ నీటిని సేవించాలి.

-గర్భిణీలు ఉండే గది వాతావరణం వేడిగా లేకుంటే చూసుకోవాలి. నార్మల్ టెంపరేచర్ ఉండేలా చూసుకోవాలి.

-గర్భధారణ సమయంలో ముక్కు నుండి రక్తం వస్తుంటే బలంగా గాలి పీల్చడం, బలంగా తుమ్మడం చేయకుండా నోరు తెరచి తుమ్మడం మంచిది.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చే యండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

మీ భర్తతో వాదించకూడని 10 సందర్భాలు

Leave a Reply

%d bloggers like this: