పిల్లలు పుట్టిన తర్వాత జరుపుకునే పెళ్ళిరోజు కోసం 5 అందమైన ప్లాన్స్

మీరు, మీభర్త మీకు బేబీ పుట్టకముందు చాలా ఏకాంతంగా గడిపి ఉంటారు. అయితే మీకు బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల మీమధ్య కొంచెం గ్యాప్ వచ్చి ఉంటుంది. దాన్ని భర్తీ చేయడానికి మీపెళ్ళి రోజును ప్రత్యేకంగా జరుపుకోండి. ఆరోజు మీ బేబీకి కూడా ప్రాధాన్యత కల్పించి ఎంజాయ్ చేయండి. మీరు పిల్లలు పుట్టిన తర్వాత జరుపుకొనే పెళ్ళిరోజును ప్రత్యేకంగా ఉంచుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటంటే,

ఇంటి దగ్గరే విందు

మీ పెళ్ళిరోజున మీరు బయటకు వెళ్ళడం అనేది చాలా రొటీన్. ఇంతకు ముందు కూడా మీరు చాలా సార్లు చేసి ఉంటారు. అయితే, ఇప్పుడు మీరు బయటకు వెళ్ళాలంటే మీకో బేబీ ఉంది. మీరు బయటకు వెళ్ళాలని ఫిక్స్ అయితే బేబీని మీఅమ్మ దగ్గర వదిలి వెళ్ళవచ్చు. బేబిని వదలడం ఇష్టం లేకపోతే ఇంటిలోనే మీకు నచ్చిన ఆహారాన్ని చేసుకోవడం లేదా తెప్పించుకోవడం వంటివి చేసి మీ పెళ్ళిరోజును ఎంజాయ్ చేయండి.

మొదటిసారి డేట్‌కు వెళ్ళిన చోటుకు

మీరిద్దరూ మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారో, మీ మనసులు ఏకాంతంగా ఎక్కడ మాట్లాడుకున్నాయో మీకు బాగా గుర్తు ఉంటుంది. మీరు మొదటిసారి ఎప్పుడైతే డేట్‌కు వెళ్ళిఉంటారో అదే ప్లేస్‌కు ఇప్పుడు మీబాబుతో వెళ్ళండి. అయితే ఈసారి మీబిడ్డను కూడా తీసుకెళ్ళి అక్కడ మీరు సమయాన్ని గడిపి రండి.

హోటల్‌లో సమయం గడపడం

మీరు బిడ్డ పుట్టక ముందు చాలా ట్రిప్స్ వేసి ఉంటారు. అయితే ఇప్పుడు బేబి పుట్టిన తర్వాత అది సాధ్యం కాకపోవచ్చు. కానీ మీపాత అలవాటూ ప్రకారం ఉన్న ప్రదేశంలోనే హోటల్ బుక్ చేసి, అక్కడే ఫుడ్ తిని, కుదిరినంతసేపు బాగా మాట్లాడుకొని మళ్ళి ఇంటికి రావచ్చు. ఈసమయంలో మీబేబిని మీఅమ్మకు ఇచ్చి వెళ్ళవచ్చు.

బేబీ వెల్‌కం పార్టీ

మీరు పార్టీ చేయాలనుకున్నట్లైతే బేబీకి వెల్‌కం చెప్పడానికి చిన్న పార్టీ ఏర్పాటు చేయవచ్చు. దీనికి మీకు కావల్సిన వారిని మాత్రమే పిలవవచ్చు. ఇందులో మీబేబీకి కూడా స్థానం ఇస్తూ మీరు అందరితో ఎంజాయ్ చేయవచ్చు.

సినిమాకు వెళ్ళడం

మీకు సినిమాకు వెళ్ళే అలవాటు ఉంటే మీభర్తతో కలిసి సినిమాకు వెళ్ళండి. అయితే మీబిడ్డను తీసుకెళ్ళాలనుకుంటే తీసుకువెళ్ళండి లేదా వారి నాయనమ్మ చేతికి ఇచ్చి వెళ్ళండి. మరీ కుదరకపోతే ఇంట్లోనే కార్టూన్ సినిమా చూడండి. మీపాప కూడా ఎంజాయ్ చేస్తుంది.

క్యాండిల్ డిన్నర్

మీకు బయటకు వెళ్ళడానికి సరిపడా సమయం లేకపోతే మీ ఇంట్లోనో, లేక బాల్కానీ మీదనో క్యాండిల్ లైట్ డిన్నర్‌ను ఏర్పాటు చేసి ఎంజాయ్ చేయండి. ఇందులో మీబేబీని కూడా జత చేసి మీ కుటుంభంలో భాగం అని ఫీల్ అవ్వండి.

ఇలా మీకు బిడ్డ పుట్టిన తర్వాత జరుపుకోబోయే పెళ్ళిరోజును చాలా ప్లాన్ చేసి, సంతోషంగా గడపండి.

Leave a Reply

%d bloggers like this: