గర్భంతో ఉన్నప్పుడు మీ పిల్లలతో బంధం ఏర్పడాలంటే చేయాల్సిన 5 పనులు

బిడ్డలకు తల్లంటే ప్రత్యేకమైన ఇష్టం ప్రేమ తమ జీవితాంతం ఉంటాయి. తనకు జన్మను ఇచ్చింది అన్న ఒక్క కారణమే కాదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి చెప్పే విషయాలు, తల్లి చెప్పే మాటలు, తల్లి చేసే పనులు అన్నీ బిడ్డకు తెలుస్తూ ఉంటాయి. అందుకే తండ్రి కన్నా తల్లికి బిడ్డతో ఎక్కువ అనుబంధం ఉంటుంది. అయితే గర్భంలో ఉన్న బిడ్డతో తల్లికి బంధం  ఏర్పడాలంటే తల్లి ఏం చేయాలో తెలుసుకోండి..

1.స్పర్శ

గర్భంతో ఉన్న తల్లి ఎప్పుడు తన గర్భంపై చేతితో తాకడం చేయాలి.  ఈ విధంగా చేయడం వలన బిడ్డకు రక్షణగా నేను ఉన్నాను అని చెప్పడమే కాకుండా మీ చేతి స్పర్శను బిడ్డ ఆనందిస్తాడు. వారికి ఎంతో ప్రశాంతతగా ఉంటుంది కూడా. అలాగే తల్లి చేతి స్పర్శను మరియు ఇతరుల స్పర్శను కూడా పిల్లలు వెంటనే కనిపెట్టడానికి కారణం.

2.బిడ్డతో మాట్లాడాలి

గర్భంతో ఉన్నప్పుడు తల్లి తనకు తెలిసిన నీతి కథలు, గొప్ప విషయాలు, మంచి మంచి మాటలు చెప్పడం, చక్కటి సంగీతం వినడం చేయాలి. బిడ్డకు 20 వ వారం నుండి వినికిడి శక్తి తల్లి గర్భంలో మొదలవుతుంది కాబట్టి అన్ని శబ్దాలను వినగలడు. ఈ విధంగా తల్లి చేయడం వలన బిడ్డతో తల్లికి బంధం బాగా ఉంటుంది.

3.ప్రపంచాన్ని చూపించడం

బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే తల్లికి బిడ్డతో బంధం ఏర్పడటం కొందరిలో జరుగుతుంది. మరికొందరిలో ఈ విధంగా జరగకపోవచ్చు. అందుకని మీరు చేసీ పనులు బిడ్డతో చెప్పడం, ఏ ఆటలు ఆడుతున్నా బిడ్డను పట్టుకుని చెప్పడం , చూపించడం వలన బయట ప్రపంచంలోకి బిడ్డ అడుగుపెట్టిన తర్వాత ప్రతికూలంగా స్పందించగలడు.

4.బిడ్డ తంతున్నప్పుడు

గర్భంతో ఉన్నప్పుడు నెలకు ఒకసారి వైద్యుడి వద్దకు వెళ్లి చెకప్ చేయిస్తూ ఉండటం సాధారణం కాబట్టి ఈ విషయాన్ని కడుపులో ఉన్న బిడ్డకు తెలిసేలా ముందే చెప్పాలి. డాక్టర్ ఎందుకు చెకప్ చేస్తున్నాడు? నువ్వు ఎలా ఉన్నావ్, నీ ఆరోగ్యం గురించేనని బిడ్డకు తెలపాలి. అలాగే మీరు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో బిడ్డ తన్నడం చేస్తుంటాడు. ఇలా తన్నడం చేస్తున్నాడంటే బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు అని గుర్తించాలి. ఈ విధంగా చేస్తున్నప్పుడు బిడ్డను తాకడం, బిడ్డతో మాట్లాడటం వంటి ప్రతి స్పందనలు చేయాలి.

5.వ్యాయామాలు

గర్భంతో ఉన్నప్పుడు యోగా, ధ్యానం, ఎక్సర్ సైజెస్ చేయమని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇది కేవలం మీ ఆరోగ్యం గురించి మాత్రమే కాదు. గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యం గురించి కూడా. ఇలా చేయడం వలన బిడ్డ ప్రతికూలంగా స్పందించగలడు.

ఈ ఆర్టికల్ పై మీ COMMENT కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే LIKE & SHARE చేయండి.

ఇవి కూడా చదవండి.

బ్రెస్ట్ ఫీడింగ్: పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు తినకూడని 5 ప్రమాదకరమైన ఆహారాలు

Leave a Reply

%d bloggers like this: