త్వరగా ప్రేగ్నన్ట్ కావాలనుకుంటే ప్రతి మహిళ ఈ 3 విషయాలు పాటించాలి!!

ప్రేగ్నన్ట్ దాల్చిన తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే, అందరూ చేసేదే. కానీ  అంతకన్నా ముఖ్యంగా మీరు ప్రేగ్నన్ట్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని విషయాల మీద తప్పకుండా శ్రద్ద తీసుకోవాలి. ప్రేగ్నన్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నాక, ఈ 3 విషయాలు తప్పకుండా చేయండి

ఫోలిక్ ఆసిడ్

గర్భం దాల్చేముందు కనీసం మూడు నెలల ముందునుంచీ… ఫోలిక్‌యాసిడ్‌, ఐరన్‌ మాత్రల్ని తప్పకుండా వేసుకోవాలి. దానివల్ల మీకు రక్తహీనత సమస్య రాకుండా అదుపులో ఉంటుంది. ఇక, ఫోలిక్‌ యాసిడ్‌ వల్ల పుట్టబోయే పాపాయిలో అవకరాల సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి.

అల్ట్రా సౌండ్ స్కాన్

ఒక అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ని తప్పనిసరిగా చేయించుకోవాలి. దాంతో పాటూ రక్తపరీక్ష, బ్లడ్‌షుగర్‌, థైరాయిడ్‌ పరీక్షలూ తప్పనిసరే. వీటివల్ల సమస్యలేవయినా ఉంటే తెలుస్తుంది. హీమోగ్లోబిన్‌ శాతాన్నీ వైద్యులు అంచనా వేస్తారు. అవసరమైన జాగ్రత్తలూ సూచిస్తారు.

బరువు

అధిక బరువున్నారేమో గమనించుకోవాలి. అలా ఉంటే గనుక తగ్గేందుకు ప్రయత్నించాలి. అవసరం అనుకుంటే వ్యాయామం, నడక.. ఇలా ఏదో ఒకటి తప్పనిసరిగా చేయడం మొదలుపెట్టాలి. మీకు ముందే మధుమేహం, ఇన్‌ఫెక్షన్ల లాంటివి ఉంటే.. వాటిని వైద్యులతో చర్చించాలి.   అలాగే అంతవరకూ తీసుకుంటోన్న మందులేవయినా ఉంటే తప్పనిసరిగా తెలియజేయాలి.

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: