మీ దగ్గర పాలు లేకపోతే వేరే తల్లి వద్ద బిడ్డ పాలు తాగవచ్చా?

పిల్లలకు తల్లిపాలు ఆరోగ్యకరమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సరైన పోషకాహార లోపం కారణంగా బిడ్డకు పాలు ఇవ్వలేక చాలామంది  తల్లులు మదనపడుతుంటారు. అటువంటప్పుడు తమ బిడ్డకు వేరే తల్లి దగ్గర పాలు ఇవ్వడం మంచిదేనా? కాదా? అనే అనుమానం ప్రతి ఒక్కరికీ ఉంది. అదేంటో వివరంగా తెలుసుకుందాం…

వేరే తల్లి పాలు బిడ్డకు ఇవ్వవచ్చా?

ఎటువంటి సందేహం లేకుండా తల్లి దగ్గర బిడ్డకు సరిపడా లేదా పాలు లేకపోతే తప్పకుండా పట్టించవచ్చు. బిడ్డకు పాలు ఇవ్వలేకపోతున్న తల్లులు ఎక్కువగా ఫార్ములా మిల్క్, మిల్క్ పౌడర్లపై ఆధారపడుతూ ఉంటారు. వీటికన్నా ఇతర తల్లుల దగ్గర బిడ్డకు పాలు పట్టించడం వలన సరైన పోషకాహారం బిడ్డకు లభించి ఆరోగ్యంగా ఉంటారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీ బిడ్డకు పాలు లేక వేరే తల్లి దగ్గర పాలు పట్టించాలనుకున్నప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే బిడ్డకు ప్రమాదం ఉంది.

-పాలిచ్చే తల్లి ఎటువంటి ఆరోగ్య సమస్యలతోనైనా బాధపడుతుందో పరీక్షలు చేయించాలి.(హెచ్ ఐ వి, హెపటైటిస్, ఇన్ఫెక్షన్స్..)

-సరైన పోషకాహారం తీసుకుంటుందా లేదా? తీసుకోకపోతే ఆ ఆహారం అందించటం చేయాలి.

-పాలిచ్చే తల్లికి ఎటువంటి టెన్షన్స్, మానసిక ఒత్తిడి లేకుండా ఆమెను ప్రశాంతంగా చూసుకోవాలి.

గమనిక:

సాధారణంగా సరైన పోషకాహారం తీసుకుంటే ఇద్దరు పిల్లలకు తల్లి పాలు ఇవ్వవచ్చు. తమ దగ్గర తమ పిల్లలకు మించి పాల ఉత్పత్తి ఉంటే వాటిని తీసి ఇతరులకు దానం చేస్తున్నవారిని మీరు చూసే ఉంటారు, ఎక్కడైనా న్యూస్ లో వినే ఉంటారు కాబట్టి, పాలు సరిపడా బిడ్డకు తల్లి ఇవ్వలేనప్పుడు వేరే తల్లి నుండి పాలు తాగించడం తప్పేమీ కాదు. 

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

తల్లి పాలు తగ్గడానికి కారణాలు ఇవే..తల్లి పాలు వృద్ధి చెందటానికి ఇంటి చిట్కాలు

Leave a Reply

%d bloggers like this: