మీ మామగారు మీ పిల్లలతో ఈ 4 పనులు చేస్తుంటే గొప్ప తాత అవుతారు

భార్యాభర్తలకు బిడ్డ పుట్టిన తర్వాత ఎంత ఆనందం ఉంటుందో మీ మామ, అత్తలకు (బిడ్డ తాత, నానమ్మ గారికి)  అంతకు మించిన ఆనందం ఉంటుంది. అలాగే మహిళ తల్లితండ్రులకు కూడా. మనవడు, మనవరాలు ప్రతి తాతకు ప్రేమ, ఇష్టం, ఆప్యాయత ఉంటుంది కానీ తాత, మనవడు మధ్య బంధం ఎలా ఉండాలో మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ విషయాలు మీ పిల్లలకు తెలియజేయండి.

తాత గొప్పదనం చెప్పాలి

తల్లిగా మీ నాన్న, మీ మామ గార్ల గురించి ప్రత్యేకంగా మీ పిల్లలకు చెప్పడం వలన వారి ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. మీరు ఎంత బిజీగా ఉన్నాసరే మీ బిడ్డను బాగా చూసుకునేది వారే. ఈ విషయం అందరు ఒప్పుకోరు తప్పక ఒప్పుకోవాల్సినది.

మీ పిల్లల ఫోటోలు పంపిస్తూ ఉండండి

ప్రస్తుత బిజీలైఫ్ లో ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని వదిలేసి సిటీలకు వెళ్తుండటం వలన మీ పెద్దలు మీ పిల్లలను చాలా మిస్ అవుతుంటారు. మీకు అంతదూరం వెళ్లడం కుదరదు కాబట్టి కనీసం నెలకు ఒక్కసారైనా మీ పిల్లల ఫోటోలు వారికి పంపించడం లేదా వీడియో కాల్ వంటివి చేయడం వలన వారికి కలిగే సంతోషాన్ని మాటల్లో వెలకట్టలేరు.

వారి పక్కన నిద్రించమని చెప్పాలి

తాతగారికి పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని, వారితో ప్రేమగా కబుర్లు చెప్పాలని, వారు మాట్లాడుతుంటే చూస్తూ ఉండాలని అనిపిస్తుంది. అది మీరే గుర్తించి తాతయ్య కథలు బాగా చెబుతాడు, తాతయ్యతో ఆడుకో, తాతయ్య దగ్గర పడుకుని నిద్రపో అని చెప్పడం వలన మీ పిల్లలకు తాతయ్య మీద గౌరవం, ఇష్టం పెరుగుతుంది.

తాతయ్యతో బయటకు పంపించాలి

మీరు ఇంటి పనులతో బిజీ, మీ ఆయనేమో ఆఫీస్ వర్క్ తో బిజీగా ఉంటారు. మరి మీ పిల్లలతో మాట్లాడేదెవ్వరు, వారిని ఆడించేదెవరు. తాతయ్య బయటకు వెళ్తున్నప్పుడు మీ పిల్లలను వారితో పాటు పార్క్, గుడికి..ఇలా తీసుకెళ్లడం వలన ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడుతుంది. మంచి స్నేహితులవుతారు.

పిల్లలతో ఇలా చేయించండి

మనవడు అంటే తాతయ్యకు ఇష్టం ప్రేమ కలగడానికి పెద్ద పెద్ద పనులు అవసరం లేదు. తాతయ్య తిన్నావా అని, తాతయ్య ఇదిగో నీళ్లు తాగు,, రా తాతయ్య టీవీ చూద్దాం అంటూ మీ పిల్లలకు చెప్పడం వలన మీ మామగారికి, నాన్న గారికి కళ్ళలో నీరు తిరిగుతాయి. అంటే ఆనంద భాష్పాలు అన్నమాట.

పాఠాలు-గుణపాఠాలు చెబుతారు

మీ నాన్న గారు, మామ గారు మీ కుటుంబంలో అందరికన్నా పెద్దవారు. వారు చూసిన జీవితం, వారు పడ్డ కష్టం గురించి బహుశా మీకు తక్కువగా తెలిసి ఉంటుంది. అందుకని మీ పిల్లలను వారికి దగ్గరగా ఉంచడం వలన మంచి అంటే ఏంటి? చెడు అంటే ఏంటో మీకన్నా బాగా చెప్పేది వాళ్ళే.

ప్రతి పండుగకు ఊరికి తీసుకెళ్లండి

బయటకు చెప్పుకోలేరు కానీ తన మనవడు, మనవరాలిని చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మీకున్న బిజీ లైఫ్ లో సంతోష క్షణాలు కుటుంబం ఆనందంగా గడిపేలా చేసేవి పండుగలు కాబట్టి. తప్పకుండా ప్రతి పండుగను వారితో సెలబ్రేట్ చేసుకోండి. ఇలా చేస్తే తాతయ్య, మనవళ్లు చాలా ఆనందంగా ఉంటారు.

పిల్లలకు బోర్ గా ఉంటుంది

మీరు మీ పెద్దలకు మీ పిల్లలను దగ్గర చేయకపోతే మీరు తప్ప వారికి ఇంకో ప్రపంచం అనేది తెలియదు కాబట్టి వారితో కలవనిస్తూ ఉండాలి. లేకపోతే వారి జీవితంలో ఏదో మిస్ అవుతున్నామనే బాధ ఉంటుంది. ఎప్పుడు డల్ గా ఉంటారు కూడా.

మీకు ఈ ఆర్టికల్ నచ్చుతుందని ఆశిస్తున్నాం. మీ అనుబంధాలను గుర్తు చేసినట్లయితే ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలిసేలా SHARE చేయండి.

ఇవి కూడా చదవండి.

మీ భర్త మీ పిల్లలతో ఎలా ఉండాలి? ఆశ్చర్యపరిచే నిజాలు

Leave a Reply

%d bloggers like this: