పిల్లలను తల్లితండ్రులు తప్పకుండా అడగవలసిన 5 ప్రశ్నలు

పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి తల్లితండ్రులకు వారే సర్వస్వం, వారే ప్రపంచం. పిల్లలంటే అంత ప్రేమ, ఇష్టం ఉన్న ప్రతి తల్లితండ్రులు  వారు ఎదుగుతున్నప్పుడు ఈ ప్రశ్నలు అడగటం వలన వారిని బాగా అర్థం చేసుకున్నవారవుతారు. ఇంతకీ తల్లితండ్రులు పిల్లలను అడగవలసిన ఆ ప్రశ్నలేంటో మీరే చూడండి.

ఇష్టాలు – అయిష్టాలు

పిల్లలకు ఏది ఇష్టమో, ఏది అయిష్టమో మీకన్నా బాగా మరెవరికీ తెలియదు కానీ ఒక్కసారి వారికి ఇష్టమైనది ఏంటి, ఇష్టం కానివి ఏంటో అడగటం వలన మీతో ప్రతి విషయాన్ని దాచుకోకుండా స్నేహపూర్వకంగా చెబుతారు. పిల్లలకు ఆడుకునే వస్తువులు, తినే పదార్థాలు అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అవి కాకుండా ఇంకా ఏమంటే ఇష్టమో కనుక్కోవాలి.

భయం

కొన్నిసార్లు పిల్లలు ఏమీ లేకుండానే భయ పడటం, స్కూల్ కు వెళ్ళమన్నప్పుడు లేదా ఎవరి దగ్గరికైనా వెళ్ళమన్నప్పుడు మారాం చేస్తూ భయపడుతూ ఉంటారు. అందుకని వారికి ఉన్న భయం ఏంటి, ఎందుకు భయమో అడిగి తెలుసుకోవడం వలన వారిలో ధైర్యాన్ని నింపిన వారవుతారు. లేకపోతే పెద్ద అయ్యే కొద్దీ కొన్ని విషయాలకు భయపడుతూనే ఉంటారు.

అమ్మ నాన్నలలో నీకు నచ్చినది ఏంటి?

పిల్లలకు ఇష్టమైన వాటిని అడగటంతో అప్పుడప్పుడు ఇటువంటి విషయాలు ప్రస్తావించడం వలన వారి తెలివితేటలపై మీకు ఒక అవగాహన వస్తుంది. నీకు అమ్మంటే ఇష్టమా, నాన్నంటే ఇష్టమా? ఎందుకు ఇష్టం, అమ్మానాన్నలలో నీకు నచ్చిన విషయాలు ఏంటో చెప్పు అని పిల్లలను అడిగితే తప్పకుండా తడబడకుండా చెబుతారు. కావాలంటే అడిగి చూడండి.

బలాలు-బలహీనతలు

చిన్నప్పటి నుండీ ప్రతి ఒక్కరికీ కొన్ని బలాలు బలహీనతలు ఉంటాయి. మీరు పక్కనే ఉంటే పిల్లలకు కొండంత అండగా, ధైర్యంగా ఉంటుంది. అది వారికి బలం. అదే మీరు పక్కన లేకపోతే ఏమీ చేయలేరు, ఏ నిర్ణయం తీసుకోలేరు. అదే బలహీనత. బలహీనత ఎక్కువగా ఉంటే భవిష్యత్ లో ఇబ్బంది పడుతారు కాబట్టి, బలహీనతను తగ్గించండి.

నువ్వు ఏం కావాలని అనుకుంటున్నావ్?

నువ్వు పెద్దయ్యాక ఏం కావాలని అనుకుంటున్నావ్ అని అడగటం వలన వారికి భవిష్యత్ పై ఇష్టం పెరుగుతుంది. వారికి తెలియకుండా ఒక లక్ష్యాన్ని ఏర్పరచినవారవుతారు. అలాగే వారికి చదువుపై ఇష్టం పెరిగేలా చేయడానికి నువ్వు బాగా చదువుకుంటే నీకో మంచి గిఫ్ట్ ఇస్తాను అంటూ ప్రోత్సహిస్తూ ఉండటం చేయాలి.

పిల్లల గురించి చిన్న వయస్సులోనే చాలా శ్రద్ధగా ఉండటం  వలన వారికి మంచి జీవితాన్ని ఇచ్చిన తల్లితండ్రులవుతారు. మీరు చేసే ప్రతి పనీ వారికి బంగారు భవిష్యత్ ను ఇస్తుంది.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

పెళ్ళి అయిన తర్వాత మీ అమ్మని మిస్ అయ్యే 10 సందర్భాలు

Leave a Reply

%d bloggers like this: