ప్రగ్నెన్సీ సమయంలో ఈ గుర్తులు కనిపిస్తే మీ ఇంట్లో మహాలక్ష్మి పుడుతుంది

గర్భంతో ఉన్నప్పుడు తమకు బాబు పుడతాడా? పాప పుడుతుందా? అని తెలుసుకోవాలని ప్రతి ఒక్క దంపతులకు ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్కాన్  ద్వారా ఇది తెలుసుకోవచ్చు కానీ మన దేశంలో చట్ట విరుద్ధం. అయితే ఇక్కడ చెప్పుకునే ఈ లక్షణాల ద్వారా మీకు పుట్టబోయేది మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల అని తెలుసుకోవచ్చు.

1.గుండె స్పందన

సాధారణంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ హార్ట్ బీట్ నిముషానికి 140 సార్లు కొట్టుకుంటుంది. అంతకంటే ఎక్కువగా హార్ట్  బీట్ ఉంటే మీకు ఆడపిల్ల పుడుతుందని గుర్తు పెట్టుకోండి.

2.కడుపు లావుగా ఉంటే

మీకు పుట్టబోయేది పాప అని తెలిపే గుర్తులలో ఇది ఒకటి. మీ గర్భం ఎక్కువ లావుగా ఉంటే ఆడపిల్ల పుడుతుందని మన పూర్వీకులు ఎప్పటినుండో చెబుతున్న మాట.

3.ప్రకాశవంతమైన ముఖం

గర్భంతో ఉన్నప్పుడు మీ శరీర ప్రకాశవంతం బట్టి మగ బిడ్డా? ఆడ బిడ్డా? అనేది తెలుసుకోవచ్చు. మీరు ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటే మీకు పుట్టబోయేది ఆడ పిల్ల అని, డల్ గా, గ్లో లేనట్లుగా ఉంటే మగ బిడ్డ.

4.మీ మూడ్ ను బట్టి

గర్భంతో ఉన్నప్పుడు మీ మూడ్ ను ఎవరు పుట్టబోతున్నారు అనేది తెలుసుకోవచ్చు. ఒత్తిడి, చికాకుగా, ఎప్పుడు పరధ్యానంగా ఉంటే మీ జీవితంలోకి మహాలక్ష్మి వస్తోందని గుర్తుపెట్టుకోండి.

5.కుడివైపున నిద్రిస్తుంటే

సాధారణంగా గర్భం సమయంలో నిద్రించేటప్పుడు ఎలా ఉండాలి అని ప్రత్యేకంగా చెబుతుంటారు డాక్టర్స్. అందరూ ఎడమవైపు తిరిగి పడుకోమని చెబుతారు. అలా కాకుండా మీరు కుడివైపు తిరిగి పడుకుంటున్నా, కుడివైపే మీకు కంఫర్ట్ గా ఉంటే మీకు పాప జన్మిస్తుంది.

6.మీ జుట్టు బిడ్డ గురించి చెబుతుంది

జుట్టు రాలడం, జుట్టు బలంగా ఉండటం మీ బిడ్డ లింగం గురించి చెబుతుంది. సన్నగా, బలహీనంగా గర్భధారణ సమయంలో జుట్టు ఉంటే ఆడపిల్ల, మందమైన బలమైన జుట్టు ఉంటే అబ్బాయి అని గుర్తుపెట్టుకోండి.

7.స్వీట్స్ ఎక్కువగా తింటుంటే

సాధారణంగా గర్భధారణ సమయంలో మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. వాటితో పాటు మీకు ఎక్కువగా స్వీట్స్ తినాలని పిస్తున్నా, ఎక్కువగా స్వీట్స్ తింటుంటే మీకు ఆడపిల్ల పుట్టబోతుందని గమనించాలి.

8.వెల్లుల్లి పరీక్ష

ఈ పరీక్ష మన అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మలు ఫాలో అవుతున్నారు. ఒక వెల్లుల్లిని తిని కొన్ని నిముషాలు అలాగే ఉండండి. కొన్ని నిముషాల తర్వాత మీ శరీరం వెల్లుల్లి వాసనగా వస్తుంటే మగ బిడ్డ లక్షణాలు, వాసన రాకుండా సాధారణంగా ఉంటే ఆడపిల్లే.

9.ఉదయం అనారోగ్యంగా

గర్భంతో ఉన్నప్పుడు కొంచెం వికారంగా, అలసటగా ఉండటం సాధారణమే కానీ ప్రతి రోజూ నీరసంగా, అనారోగ్యంగా ఉండటం జరుగుతుంటే మీకు పుట్టబోయేది ఆడపిల్ల అని గుర్తించాలి.

10.బేకింగ్ సోడా పరీక్ష

రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో గర్భిణీతో ఉన్న మహిళ మూత్రం పోయాలి. ఈ రెండిటినీ బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఇది బుడగలుగా వస్తుంటే అబ్బాయి లక్షణాలు, ఎటువంటి రియాక్షన్ లేకుండా అలానే ఉంటే అమ్మాయి లక్షణాలు అని అర్థం.

ఇక్కడ చెప్పుకున్నవన్నీ సైన్టిఫిక్ గా నిరూపితమైనవి కాదు గానీ చాలా ఏళ్ళ క్రితం నుండి మన పెద్దలు ఫాలో అవుతున్న విషయాలు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.   మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి. 

ప్రసవం తర్వాత రోగనిరోధక శక్తిని వెంటనే పెంచే 9 మార్గాలు!!

Leave a Reply

%d bloggers like this: