“మీ గర్భం ప్రమాదంలో ఉంది….” అని తెలియడానికి ఇవే 7 గుర్తులు

ఆడవాళ్ళకి తాము గర్భంతో ఉన్నాం అని తెలుసుకోవడం, చాలా సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. తమ జీవితంలో ఈ సందర్భం కోసం ఎన్నో ఏళ్ళ నుండి ఎదురుచూస్తూ ఉంటారు. ఆ కోరిక నిజమయ్యాక ఆ సంతోషాన్ని అందరితో పంచుకుంటారు. ఎప్పుడుడెప్పుడు తమ గర్భంలో ఉన్న తమ బిడ్డను చేతిలోకి తీసుకుని “అమ్మ” అయిపోదామా….అని ప్రతి క్షణం ఆలోచిస్తూవుంటారు. కానీ గర్భం దాల్చటం తోనే కథ సుఖాంతం అవదు. ఎన్నో గండాలు అడుగడునా ఎదురవుతాయి. మీ గర్భానికి ప్రమాదం కలిగిస్తాయి. ముందే తెలుసుకుని జాగ్రత్త పడితే మీ గర్భాన్ని, మీ బిడ్డను కాపాడుకోవచ్చు. అందుకు కొన్ని గుర్తులు ఉన్నాయి….,అవేంటో తెలుసుకోండి…

1. శరీరంలో వాపు

మీరు ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు ఏ విధమైన వాపు మీ శరీరంలో కనిపించినా ముందే జాగ్రత్తపడండి. మీ ముఖంలో, చేతుల్లో వాపు కనిపించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. అది మీకు, మీ కడుపులోని బిడ్డకు జరిగే ప్రమాదానికి సంకేతాలు కావచ్చు. ప్రీ ఏక్లాంసియా అయితే ఇలానే జరుగుతుంది.

2. శరీరం నుండి విడుదలయ్యే ద్రవాలు

37 వారాల ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు, మీ యోని నుండి ద్రవాలు అధికంగా వస్తుంటే, అది మీ గర్భానికి ప్రమాదం. గర్భస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి. ముందుగా డాక్టర్ ని కలవడం వలన గర్భస్రావాన్ని నివారించవచ్చు.

3. తీవ్రమైన వెన్ను నోప్పి

ప్రెగ్నన్సీ తో వున్నా వారికీ వెన్ను నొప్పి సహజమే. గర్భం లో బిడ్డ బరువు పెరుగుతున్న కొద్ది, మీ వెన్ను మీద వత్తిడి పెరిగి నొప్పి కలుగుతుంది. కానీ ఆ నొప్పి మరి తీవ్రమైతే అది మీకు ప్రమాదమే. 12 వారాల ప్రెగ్నన్సీ సమయంలో తీవ్రమైన వెన్ను నొప్పి ఉంటె అది గర్భశ్రావానికి గుర్తు. 37 వారాల ప్రెగ్నన్సీ సమయంలో వస్తే నెలల తక్కువ కాన్పు జరగడానికి అవకాశం ఉంటుంది.

4. కదలికలు లేకపోతే

మీరు గర్భంతో ఉన్నప్పుడు బిడ్డ ఆరోగ్యాంగా ఉంటే కడుపులో కదులుతూ ఉంటాడు. పిల్లలు కడుపులో తంతు ఉండడం, కదలడం లాంటివి జరుగుతుంటే మీ గర్భం ఆరోగ్యాంగా ఉన్నట్టే. ఒకవేళ మీ కడుపులోని బిడ్డ ఎటువంటి కదలికలు చేయకపోతే. మీ గర్భం ప్రమాదంలో ఉన్నట్టు.

5. రక్త స్రావం

ప్రెగ్నన్సీ తో వున్నప్పుడు రక్త స్రావం ఎక్కువగా జరిగితే, అది గర్భం పోడానికి సంకేతమే. అందుకే రక్త స్రావం ఎక్కువగా ఉన్నప్పుడు తప్పకుండా డాక్టర్ ను సంప్రదించండి. ఇది ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ కి చిహ్నం కావచ్చు.

6. తల నొప్పి

ప్రెగ్నన్సీ సమయంలో అప్పుడప్పుడు తల నొప్పి వాస్తు ఉంటుంది.  కానీ తల నొప్పి ఎక్కువగా ఉండి, కాళ్ళు మసక బారడం లాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి, అది గర్భస్రావానికి గుర్తు.

7. పొత్తి  కడుపులో

ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు పోతి కడుపు నొప్పి సహజమే. కానీ ఆ పొత్తి కడుపులో నొప్పి భరించ లేనంత తీవ్రంగా ఉంటే, అది మీకు, మీ కడుపులో బిడ్డకు చాలా ప్రమాదం. ఆ లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. 

Leave a Reply

%d bloggers like this: